ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దారిలో!: పరకాలపై కెసిఆర్‌కు బాజిరెడ్డి సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bajireddy Govardhan Reddy
అదిలాబాద్/అనంతపురం: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ 2014 ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి కావడం కల్ల అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆదివారం అదిలాబాద్ జిల్లాలో అన్నారు. వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి నైతిక విలువలు ఉంటే ఆమెపై పోటీ పెట్టకూడదని సూచించారు.

ఇప్పటి వరకు తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని నిలపలేదని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంటు కారణంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారనే భావనతో జగన్ పోటీకి దూరంగా ఉన్నారన్నారు. ఇప్పుడు తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు దీనిపై ఆలోచించాలని సూచించారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని తాజా మాజీ శాసనసభ్యుడు గుర్నాథ్ రెడ్డి అనంతపురంలో అన్నారు. వైయస్‌ను విమర్శఇంచే వాళ్లు మొదట తమ పదవులకు రాజీనామాలు చేసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బొమ్మతో ఎన్నికల్లో నిలబడి గెలుపొందాలని సవాల్ విసిరారు.

జగన్ పార్టీ అభ్యర్థులు దివంగత వైయస్ ఫోటోతో, కాంగ్రెసు నేతలో సోనియా బొమ్మతో బరిలోకి దిగితే గెలుపు ఎవర్ని వరిస్తుందో తెలుస్తుందన్నారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ వైయస్ రాజశేఖర రెడ్డియే తన అధిష్టానం అని ఆయన చెప్పారు. జీవితాంతం తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉంటానని చెప్పారు.

ఓట్ల కోమే ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తోందని మరోనేత మేకపాటి చంద్రశేఖర రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. మంజూరు చేసిన నిధులు కార్యకర్తల జేబులు నింపేందుకు తప్ప అభివృద్ధికి మాత్రం కాదన్నారు. ఓటమి భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఉప ఎన్నికలను వాయిదా వేయించాలని చూస్తోందంటూ మేకపాటి విమర్శించారు.

English summary
YSR Congress Party leader Bajireddy Govardhan Reddy suggested Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao on Parkal constituency. He said AICC general secretary Rahul Gandhi will not sit on Prime Minister's seat after 2014 also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X