హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ సిఫార్సుతో విజయ నిర్మలకు విల్లా: సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijaya Nirmala
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సిఫార్సుతో సినీ నటి విజయ నిర్మలకు తక్కువ ధరకు విల్లాలు కేటాయించినట్లు సిబిఐ సోమవారం కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొన్నట్లు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో సిబిఐ సోమవారం సాయంత్రం చార్జిషీట్ దాఖలు చేసింది. ఉదయం సునీల్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టింది. సునీల్ రెడ్డి, విజయరాఘవలపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది.

టీవీ చానెళ్ల కథనాల ప్రకారం - విల్లాల కొనుగోలులో విజయరాఘవ అక్రమాలకు పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. శ్రవణ్ గుప్తా పేరును కూడా సిబిఐ నిందితుల జాబితాలో చేర్చింది. సునీల్ రెడ్డి 96 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో సునీల్ రెడ్డి, కోనేరు ప్రసాద్, తుమ్మల రంగారావు కీలకమని సిబిఐ చెప్పింది. సునీల్ రెడ్డి ద్వారా విఐపిలు లావాదేవీలు నడిపినట్లు ఆరోపించింది.

విజయరాఘవ 18 విల్లాలను తన సొంతవారికి కట్టబెట్టారని తెలిపింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ విల్లాల వ్యవహారంలో భారీ మొత్తాల వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపించింది. చార్జిషీట్ తమకు ఇవ్వాలంటూ వారిద్దరి తరఫు న్యాయవాదులు కోర్టులో మెలో దాఖలు చేశారు. ఎమ్మార్ కేసులో ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో సిబిఐ పలువురు ప్రముఖులను ఇప్పటికే విచారించింది. విల్లాలను కొనుగోలు చేసినవారి నుంచి వాంగ్మూలాలను స్వీకరించింది. కాంగ్రెసు నాయకుడు డి. శ్రీనివాస్ సహా మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కోడలు బ్రాహ్మణి వంటి పలువురి వాంగ్మూలాలను స్వీకరించింది.

English summary
According to TV channels reports - actress vijaya Nirmala was allotted villa in EMAAR properties with the recommendation of YS Rajasekhar Reddy. CBI has filed supplementary charge sheet in EMAAR properties in court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X