• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉప ఎన్నికల షెడ్యూలు రిలీజ్, గందరగోళంలో కాంగ్రెస్

By Srinivas
|

Election Commision Logo
న్యూఢిల్లీ/హైదరాబాద్: 2014 సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూలును మంగళవారం భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 18వ తారీఖున ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్ల స్వీకరణ గడువు తేది మే 25న ఉంటుంది. మే 26న వచ్చిన నామినేషన్లను పరిశీలిస్తారు. 28న ఉపసంహరణ ఉంటుంది. జూన్ 12వ తేదిన ఉప ఎన్నికలను నిర్వహిస్తారు. అదే నెల 15 తేదిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా షెడ్యూలు విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లే.

ఉప ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తర్జన భర్జనకు తెరపడింది. రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ఈసి చెప్పగా, ఆగస్టు వరకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు చూచాయగా చెప్పిందనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా షెడ్యూలు ఈసి విడుదల చేయడంతో చర్చకు తెరపడింది.

నర్సన్నపేట, పాయకరావుపేట, రామచంద్రాపురం, పోలవరం, నర్సాపురం, పత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, అనంతపురం, రాయదుర్గం, రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డతో పాటు తెలంగాణ ప్రాంతంలోని పరకాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.

గత సంవత్సరం డిసెంబరులో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి చందిన పదహారు మంది శాసనసభ్యులపై స్పీకర్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆళ్లగడ్డకు చెందిన శోభా నాగి రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. ఆమెపై వేటు పడలేదు. ఇక చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో తిరుపతి స్థానం ఖాళీ అయింది.

సిబిఐ ఎఫ్ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ఉన్నదని మేకపాటి రాజమోహన్ రెడ్డి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ మీరా కుమార్ ఆయన రాజీనామాను ఆమోదించారు. కాగా ఉప ఎన్నికలు ఇప్పుడప్పుడే జరగనవే భావనతో రాష్ట్రానికి చెందిన కాంగ్రెసు నేతలు ఇన్నాళ్లూ ఉన్నారు.

అయితే ఈసి అనూహ్యంగా షెడ్యూలు విడుదల చేయడంతో నేతలు గందరగోళంలో పడ్డారని అంటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఎండాకాలం నీటి ఇక్కట్లు, కరెంట్ కోతలు ఇలా పలు సమస్యలు ఉన్న సమయంలోనే ఉప ఎన్నికల షెడ్యూలు విడుదల కావడం వారికి మింగుడు పడటం లేదని అంటున్నారు.

తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు దాదాపు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతున్నాయి. కానీ కాంగ్రెసు మాత్రం కొన్ని స్థానాలలోనే అభ్యర్థులను ఖరారు చేసుకుంది. అది కూడా బహిరంగంగా ఇప్పటి వరకు ప్రకటించింది లేదు. షెడ్యూలు విడుదలతో జగన్, చంద్రబాబు తమ వ్యూహాలకు సాన పెట్టనున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The election commission of India on Wednesday issued schedule for the byelections in 18 Assembly and 1 Parliement constituencies in the state. As per the notification, by-elections will be held in Tirupati, Parkal, Allagadda and other fifteen Assembly segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more