హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటోంది: ఆచార్యపై సిఐబి

By Pratap
|
Google Oneindia TeluguNews

BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తొలి నిందితుడైన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్య ప్రాసిక్యూషన్‌ను రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందని సిబిఐ ఆరోపించింది. ఆచార్య దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా సిబిఐ ఆ వాదన వినిపించింది. ప్రభుత్వ యంత్రాంగంలో ఆచార్య సహచరులే ఉన్నారని, దాని వల్ల ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబిఐ కోర్టుకు విన్నవించింది.

ఆచార్య ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే జాప్యం చేస్తోందని సిబిఐ అన్నది. తాము చేసిన ఆరోపణలపై ఆచార్య నుంచి రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరిందని చెప్పింది. బిపి ఆచార్య ఇచ్చిన వివరణలపై ప్రభుత్వం మళ్లీ వివరణ కోరుతోందని, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని సిబిఐ కోర్టుకు విన్నవించుకుంది.

కాగా, ప్రాసిక్యూషన్‌కు అనుమతి రాకపోవడంతో బిపి ఆచార్యకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా బిపి ఆచార్య ప్రాసిక్యూషన్‌కు అనుమతి రాలేదని చెప్పారు. సర్వీసులో ఉండగా బిపి ఆచార్యపై ఒక్క ఆరోపణ కూడా లేదని ఆయన గుర్తు చేశారు. బిపి ఆచార్య బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని సిబిఐ కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

ఇదిలా వుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డికి రెండో చార్జిషీట్‌ను ఇచ్చేందుకు సిబిఐ కోర్టు నిరాకరించింది. బిపి ఆచార్య, విజయరాఘవ, సునీల్ రెడ్డిలకు కూడా అనుబంధ చార్జీషీట్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అవసరమైతే కోర్టులో చార్జిషీట్‌ను చదువుకోవడానికి వారికి అనుమతి ఇచ్చారు. ఎమ్మార్ కేసులో అనుబంధ చార్జీషీట్‌ను కోనేరు ప్రసాద్‌కు ఇచ్చేందుకు మాత్రం కోర్టు అంగీకరించింది.

English summary
CBI has blamed state government for delaying to give permission to prosecute IAS officer BP Acharya in EMAAR case. Court reserved its decision on bail petition filed by BP Acharya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X