హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కాననే నిస్పృహలో బాబు పిచ్చి మాటలు: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్/ఒంగోలు: తాను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదనే నిస్పృహలోనే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం మండిపడ్డారు. చంద్రబాబుతో పాటు కొందరు కాంగ్రెసు పార్టీ నేతలకు కూడా పిచ్చి ముదిరి తమ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారన్నారు.

కమలాపురం ఎమ్మెల్యే వీర శివా రెడ్డి, రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు, రేణుకా చౌదరిలకు కూడా పిచ్చి ముదిరిందని, అందుకే వారు జగన్‌ను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. జగన్‌పై బురద జల్లేందుకు చంద్రబాబు స్థాయి తక్కువ మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఉప ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావని తెలిసి ఇలాంటి డ్రామాలకు తెరలేపారన్నారు.

ఉప ఎన్నికల తర్వాత జగన్‌ను చూస్తే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు జడుసుకునే పరిస్థితి వస్తుందన్నారు. విశ్వాసఘాతుకానికి, అవినీతికి చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమన్నారు. చంద్రబాబు యువనేత జగన్ పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అబద్దాలు ఆడినా అతికినట్లు ఉండాలని సూచించారు.

పేద ప్రజల ఆరోగ్యం కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో అన్నారు. వైయస్ ఆరోగ్య ప్రధాత అన్నారు. వైయస్ పథకాలు ప్రజలు మరిచిపోలేరన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేసిన ఘనత వైయస్‌దేనన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కావని బాలినేని అన్నారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu lashes out at Telugudesam Party chief and former chief minister Nara Chandrababu Naidu on thursday. He blamed, Babu is targeting Kadapa MP YS Jaganmohan Reddy in the depression only. He also lashes out at Renuka Chowdary and Veera Siva Reddy also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X