• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజ్యసభకు నిన్నటి తరం బాలీవుడ్ హీరోయిన్ రేఖ

By Srinivas
|

Rekha
న్యూఢిల్లీ: నిన్నటి తరం బాలీవుడ్ హీరోయిన్ రేఖ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆమెను రాజ్యసభకు నామినేట్ చేయాల్సిందిగా ప్రభుత్వం సిఫార్సు చేసింది. రేఖ 1980వ దశకంలో బాలీవుడ్‌లో లీడింగ్ హీరోయిన్. ఇప్పుడు ఈమె పార్లమెంటులో రాజ్యసభ మెంబరుగా కనిపించనున్నారు. కాగా గురువారం రాత్రి రేఖతో పాటు సచిన్ టెండుల్కర్, అనూ ఆగాలను ఎగువ సభకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ నామినేట్ చేశారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి పన్నెండు మందిని ఎగువ సభ రాజ్యసభకు ఎంపిక చేస్తారు. రాజ్యసభకు నామినేట్ చేయనున్న పేర్లను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్‌కు బుధవారం పంపించారు. ఇది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు పంపిస్తారు. ఆమె వాటిని పరిశీలించి ప్రకటిస్తారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం సాహిత్యం, శాస్త్రీయం, కళ, సామాజిక సేవ తదితర రంగాలలోని ప్రముఖులను ఎంపిక చేసే అవకాశం ఉంది. రేఖ వయస్సు యాభై ఏడేళ్లు. ఈమె తన నటనకుగాను తన కేరీర్‌లో ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ప్రముఖ హిందీ రచయిత, స్ర్కిప్ట్ రైటర్ జావెద్ అక్తర్ ఇప్పటికే రాజ్యసభలో ఉన్నారు.

కాగా మాస్ట్రర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరును కూడా రాజ్యసభకు ప్రభుత్వం సిఫార్సు చేసింది. సచిన్ పేరును ప్రతిపాదించాలని హోంమంత్రిత్వ శాఖకు ప్రధాని లేఖ రాశారు. రేఖ, సచిన్ టెండుల్కర్‌ల పేర్లను సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని ప్రముఖ వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు.

English summary
Actress of yesteryear Rekha is among four eminent persons who have been recommended for nomination as members of Rajya Sabha. Rekha, known for her brilliant and emotional portrayals in Hindi cinema in the 80s, will become member of Parliament under a provision of the constitution that allows the President to nominate 12 members to the Upper House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X