వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు ఎమ్మెల్యే హికాకా విడుదల: రిజైన్ హామీతోనే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jhina Hikaka
భువనేశ్వర్: మావోయిస్టుల చెర నుండి ఒడిషా రాష్ట్రానికి చెందిన అధికార పార్టీ బిజెడి శాసనసభ్యుడు జిన్నా హికాకా గురువారం విడుదలయ్యారు. ఈయన లక్ష్మీపురం స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నెల రోజులకు పైగా మావోయిస్టుల చెరలో ఉన్న హికాకాను మావోయిస్టులు ఉదయం విడుదల చేశారు.

ఆయన ఉదయం పదిగంటల ప్రాంతంలో బలిపేటకు చేరుకున్నారు. ఆయన కోసం కుటుంబ సభ్యులు, నియోజకవర్గం కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. జర్నలిస్టులు తరలి వచ్చారు. హికాకా 32 రోజుల పాటు మావోల చెరలో ఉన్నారు. మావోలు అతనిని విజయిఘాటి అడవులలో వదిలి పెట్టారు. తనను విడుదల చేసినట్లు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా మీడియాకు సమాచారం అందించారు.

హికాకాను గత మార్చి 24న మావోలు అపహరించారు. అప్పటి నుండి ప్రభుత్వం ఆయన విడుదల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయితే విదేశీయుల విడుదలకు చూపిన చొరవను ప్రభుత్వం చూపలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. హికాకా మావోయిస్టు సానుభూతిపరుడు కాబట్టి ఆయనను ఏమీ చేయలేరనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం అంత చొరవ చూపలేదని అంటున్నారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే ఒప్పందంతో మావోలు జిన్నా హికాకాను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇటీవల జరిగిన ప్రజాకోర్టులో రాజీనామా చేస్తానని లిఖిత పూర్వక హామీ ఇచ్చారని తెలుస్తోంది. బిజెడితో అన్ని సంబంధాలను తెంచుకొని సాధారణ పౌరుడిగా జీవించాలని ఆయనను మావోలు ఆదేశించారట. అపహరణ అనంతరం ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై జిల్లా బిజెడి కార్యకర్తలు, నాయకుల తీరుపై హికాక అసంతృప్తి కూడా వ్యక్తం చేశారట.

English summary
After being in Maoists' captivity for over a month, Odisha BJD MLA Jhina Hikaka has been released on Thursday morning. According to TV reports, Jhina Hikaka was released at an undisclosed loaction. The decision to free Hikaka was taken at the people's court on Tuesday after he gave an undertaking that he will resign from the state assembly and also try and get the Maoists' demands fulfilled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X