హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోనేరుమధు లొంగుబాటు, ఏడాదిగా దుబాయ్‌లో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Koneru Madhu
హైదరాబాద్: ఎమ్మార్ కేసులో పదమూడవ నిందితుడుగా ఉన్న కోనేరు మధు శుక్రవారం కోర్టులో లొంగిపోయారు. ఎమ్మార్ విల్లాల విక్రయాల ద్వారా వచ్చిన రూ.కోటి ఐదు లక్షలు కోనేరు మధు ఖాతాలోకి వెళ్లినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అధికారులు అభియోగం చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు గతంలో కోనేరు మధుకు లొంగిపోవాలంటూ సమన్లు జారీ చేసింది.

కోనేరు మధు గత సంవత్సరానికి పైగా దుబాయిలో ఉంటున్నాడు. ఎమ్మార్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదయ్యాక, పలువురిని విచారించిన పోలీసులు అరెస్టులు కూడా చేశారు. అయితే మధు దుబాయిలో ఉన్నందున విచారణ కుదరలేదు. దీంతో సిబిఐ కోర్టును ఆశ్రయించింది. కోర్టు కోనేరు మధుకు లొంగిపోవాలంటూ సమన్లు జారీ చేసింది.

దీంతో ఆయన శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎమ్మార్ ఫండ్స్ నుండి మధు ఖాతాకు డబ్బులు మళ్లించినట్లు విచారణలో సాక్ష్యులు సిబిఐకి చెప్పారు. రంగారావు ద్వారా చెల్లించిన సొమ్ము ఆయన ఖాతాలోకి వెళ్లాయని అభియోగం. కోనేరు మధు ఇదే కేసులో నిందితుడుగా ఉన్న కోనేరు ప్రసాద్ తనయుడు. మధుపై పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు పెట్టారు.

కాగా ఇదే కేసులో అరెస్టైన కోనేరు ప్రసాద్, బిపి ఆచార్య, ఓబుళాపురం మైనింగ్ కార్పోరేషన్ అక్రమాలపై అరెస్టైన శ్రీనివాస్ రెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రిమాండ్ గడువు ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు ఉద్యోగాలు, సినీ అవకాశాల పేరుతో అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపారనే అభియోగాలతో అరెస్టైన తారా చౌదరిని కోర్టులో హాజరు పర్చారు.

English summary
Koneru Madhu son of Koneru Prasad, who is thirteenth accused in EMAAR case was surrendered in Nampally court on friday. CBI alleged, Rs.1.05 crores transferred from EMAAR funds to Koneru Madhu acconuts. Court issued summons to Madhu before.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X