ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్టే ఎత్తివేతకు నో: సుప్రీంలో టిడిపి ఎమ్మెల్యేకు ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Suman Rathod
న్యూఢిల్లీ: అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు సుమన్ రాథోడ్‌కు సుప్రీం కోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఆమె ఎస్టీ కాదని, శాసనసభ్యురాలిగా సుమన్ రాథోడ్ ఎన్నిక చెల్లదంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని హరినాయక్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఎన్నిక చెల్లదనే స్టే ఎత్తివేయమని సుప్రీం పిటిషన్‌దారుడికి తేల్చి చెప్పింది.

హరినాయక్ ఖానాపూర్ నియోజకవర్గం నుండే కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా 2009 ఎన్నికలలో సుమన్ రాథోడ్ పైన పోటీ చేసి ఓడిపోయారు. సుమన్ టిడిపి తరఫున గెలిచింది. ఆ తర్వాత హరినాయక్ ఆమె ఎస్టీ కాదని కోర్టుకెక్కారు. ఈ వ్యవహారం మొదట జిల్లా కలెక్టర్ పరిధిలోకి రాగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కుల ధృవీకరణపై వేసిన కమిటీ సుమన్ రాథోడ్ ఎస్టీ కాదని చెప్పింది.

దీంతో హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ సుమన్ రాథోడ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇచ్చిన 2003 అమైన్డుమెంట్‌ను కొట్టివేస్తూ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు తీర్పుపై స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సుప్రీం స్టే ఎత్తివేయాలని కోరుతూ హరినాయక్ మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. దీనిని కోర్టు శుక్రవారం తిరస్కరించింది.

సుమన్ రాథోడ్ విషయంలో స్టే ఎత్తివేయాలన్న హరినాయక్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో జిల్లాకు చెందిన టిడిపి వర్గం హర్ష్యం వ్యక్తం చేసింది. అదిలాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీకి సుమన్ రాథోడ్, ఆమె భర్త, ఎంపి రమేష్ రాథోడ్‌లు పెద్ద దిక్కు. ఈ సమయంలో ఆమెకు ఊరట లభించడం గమనార్హం. కాగా ఎన్నిక చెల్లదనే తీర్పుపై స్టే ఉన్నప్పటికీ సుమన్ రాథోడ్‌కు అసెంబ్లీలో ఓటింగ్ విషయానికి వస్తే ఆమె ఓటును పరిగణలోకి తీసుకోరు.

English summary

 Supreme court rejected Harinaik's petition on friday. He filed a petition in Supreme Court to lift stay on Khanapur of Adilabad MLA Suman Rathod. But SC rejected his petition. He was contested from same constituency in 2009
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X