వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచిన్ సరే, సౌరవ్ గంగూలీ మాటేమిటి: సిపిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sourav Ganguly-Sachin Tendulkar
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంటే సిపిఐ కొత్త రాగం అందుకుంది. నటి రేఖ, పారిశ్రామికవేత్త అను ఆగాలతో పాటు సచిన్ టెండూల్కర్‌ను రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. సచిన్‌ను నామినేట్ చేయడం క్రీడల్లో ప్రతిభకు గుర్తింపు నిజంగా లభించినట్లేనని సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా అంటూనే టాప్ ఫామ్‌లో ఉన్నప్పుడు సౌరవ్ గంగూలీ పేరును ఎందుకు సిఫార్సు చేయలేదని ప్రశ్నించారు.

ఇతర క్రీడల్లో ప్రతిభను కనబరిచినవారిని కూడా రాజ్యసభకు నామినేట్ చేసే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కేవలం క్రికెట్‌ను మాత్రమే ప్రోత్సహిస్తున్నామనే అభిప్రాయం కలగకూడదని ఆయన అన్నారు. సచిన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా ఆయన ప్రజాదరణ ద్వారా ప్రయోజనం పొందాలని కాంగ్రెసు పార్టీ ప్రయత్నిస్తోందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ అన్నారు. కాంగ్రెసు తన ప్రతిష్టను పెంచుకోవడానికి చూస్తోందని, అందుకు సచిన్‌తో రాజకీయాలు ఆడుతోందని ఆయన అన్నారు.

రౌత్ విమర్శలను కాంగ్రెసు సభ్యుడు రాజీవ్ శుక్లా ఖండించారు. మంచివారని తాము పార్లమెంటుకు తీసుకుని రావాలని అనుకుంటున్నామని, సచిన్‌కు ఇది గౌరవమని ఆయన అన్నారు. సోనియా వద్దకు సచిన్ టెండూల్కర్‌ను, ఆయన భార్య అంజలిని రాజీవ్ శుక్లానే తీసుకుని వెళ్లారు.

శుక్రవారం రాత్రి సచిన్ టెండూల్కర్ ఐపియల్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. ఓ రాజ్యసభ సభ్యుడితో తన మొదటి ఐపియల్ గేమ్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. సచిన్ టెండూల్కర్‌కు భారత ఎందుకు ఇవ్వలేదని పలు వైపుల నుంచి ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో రాజ్యసభకు నామినేట్ చేశారు. మార్చిలో సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన వందో సెంచరీ పూర్తి చేశాడు. రాజకీయ పార్టీలతో అనుబంధాన్ని ఇష్టపడని సచిన్ టెండూల్కర్ రాజ్యసభలో కాంగ్రెసుకు చెందినవాడిగా వ్యవహరిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు.

English summary
CPI leader Guruda Dasgupta said that Sachin's nomination is a real recognition of sports talent, and added that Sourav Ganguly could also have been considered when he was in form. Sivasena leader Sanjat Raut criticized Congress wants take political mileage by nominating Sachin Tendulkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X