వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రెసిడెంట్ గిలానీ దోషి: తేల్చిన పాక్ సుప్రీం, 30సెకన్ల శిక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

Yousuf Raza Gilani
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడు యూసఫ్ రాజా గిలానీకి పాకిస్తాన్ సుప్రీం కోర్టు గురువారం ముప్పై సెకండ్ల పాటు శిక్ష విధించింది. తనపై అవినీతి కేసులు తిరగదోడకుండా కోర్టు ధిక్కారానికి పాల్పడిన గిలానీని సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే నామమాత్రపు శిక్ష విధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం ముప్పై సెకండ్ల కాలంలో ఆయన శిక్ష ముగిసింది.

గిలానీని జైలు శిక్ష నుంచి మినహాయించిన న్యాయమూర్తులు.. 63వ అధికారణం మేరకు తీర్పు ఇచ్చేందుకు అవకాశం ఉన్నా, దాని వల్ల గిలానీ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఉద్దేశ్యంతో దాన్ని ఉపయోగించడం లేదని పేర్కొన్నారు. జడ్జీలు నిష్క్రమించే వరకు లేదా కోర్టులో విచారణ ముగిసే వరకు శిక్ష విధిస్తున్నట్లుగా సుప్రీం జడ్జీలు తీర్పు ఇచ్చారు. ఆ వెంటనే కోర్టు నిష్క్రమించింది. దీంతో గిలానీ శిక్ష ముగిసినట్లయింది. విచారణ ప్రక్రియ మొత్తం పది నిమిషాల్లోనే పూర్తయింది.

శిక్ష స్వల్పమైనదే అయినప్పటికీ గిలానీ ప్రధానిగా కొనసాగడంపై, ఆయన పార్లమెంటు సభ్యత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాక్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టులో దోషిగా తేలితే ప్రధాని పదవికి అనర్హుడు. దీంతో ఇప్పుడు ఆయన పదవిపై చర్చ ప్రారంభమైంది. ఆయన ప్రధాని పదవికి అనర్హుడని విపక్షాలు మండిపడుతున్నాయి.

అయితే పాక్ మంత్రివర్గం మాత్రం ఆయనకు బాసటగా నిలిచింది. ఇది కేవలం కోర్టు ధిక్కారణ కేసు కాబట్టి దీనికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. గిలానీకి విధించిన శిక్షపై అప్పీల్‌కు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) అధినేత నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్(పిటిఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌లు గిలానీ గద్దె దిగవల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

English summary
Pakistan’s Supreme Court on Thursday convicted Prime Minister Yousuf Raza Gilani of contempt for defying its orders to reopen an old corruption case against the president, but the justices spared Gilani any prison time. The sentence was symbolic, lasting only until judges left the courtroom. But Gilani's political future remains clouded by the possibility that he could still be removed from office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X