హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎంపీలపై సోనియా అసంతృప్తి: పాల్వాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palwai Govardhan Reddy
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తితో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆదివారం అన్నారు. ఎంపీలు తననే బ్లాక్ మెయిల్ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని సోనియా గాంధీ ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు. సోనియాతో శతృత్వం పెంచుకొని తెలంగాణ రాకుండా చేస్తారా అని ఆయన ఎంపీలను ప్రశ్నించారు. అలాగే తెలంగాణ వచ్చాక కాంగ్రెసు పార్టీ ఉండాలా వద్దా అని ఆయన వారిని అడిగారు.

తెలంగాణ రాకపోవడానికి కారణం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలే కారణమని ఆయన ఆరోపించారు. ఎంపీలు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అడిషనల్ డిజి అవినీతిపరుడు అని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాలనీలో అక్రమాలు జరిగాయంటే ఆయన పట్టించుకోలేదన్నారు. ఎమ్మెల్యేలకే న్యాయం జరగకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నారు. డిజిపికి పోలీసులపై పట్టు లేదని విమర్శించారు.

మరోవైపు ఏఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆమె రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రితో చర్చించినట్లుగా తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలపై కూడా చర్చించారని సమాచారం. కాగా భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండదని ఆమె స్పష్టం చేశారు. క్రమశిక్షణ లేని నేతలే మార్పు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమన్వయంతో పని చేస్తున్నారన్నారు. తాను ముమ్మాటికి తెలంగాణవాదినేనని ఆమె చెప్పారు.

English summary
Congress party Rajya Sabha Member Palvai Govardhan Reddy said, AICC president Sonia Gandhi is disappointed with Telangana region party MPs attitude. He questioned MPs, will we get Telangana if we blame her. He said state Congress leaders are the main cause to delay of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X