విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు సమాధానం చెప్తా: వల్లభనేని వంశీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamshi
విజయవాడ: తాను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిసి స్వయంగా వివరణ ఇస్తానని ఆ పార్టీ విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ శనివారం అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలయికపై తెలుగుదేశం పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని, ఉంటానని చెప్పారు.

జగన్ రెండోసారి పలకరించడంతో సంస్కారం కాదన్న ఉద్దేశంతోనే నమస్కారం చేశానని చెప్పారు. ఇంత వివాదం అవుతుందనుకోలేదన్నారు. జరిగిన విషయాన్ని అధినేతకే చెబుతానని, పరిటాల హత్య వెనుక జగన్ హస్తం ఉందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సమర్థించటానికి నా దగ్గర ఆధారాలూ లేవని చెప్పారు. జగన్, వంగవీటి రాధా వాహనం దిగి రావడంతో తాను కూడా ఎదురు వెళ్లానని చెప్పారు.

జగన్‌ను ఆలింగనం చేసుకోలేదన్నారు. తనకు ఇంకా నోటీసు అందలేదని, మూడు నాలుగు రోజుల్లో ఆయనను కలిసి ఇచ్చే వివరణను మీడియాకూ ఇస్తానని చెప్పారు. వంగవీటి రాధాను గతంలో టిడిపిలోకి తీసుకురావాలని ప్రయత్నించానని చెప్పారు. మాజీ మంత్రి పరిటాల రవి అనుచరుడిని అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

తన కుమారుడికి సునీతమ్మ రవి పేరు పెట్టారని, ఎవరైనా బిడ్డలతో రాజకీయాలు చేస్తారా అన్నారు. జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వర రావుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. వంగవీటి రాధ కూడా తనకు మంచి మిత్రుడన్నారు. సమాచార లోపం వల్లనే షోకాజ్ నోటీసు ఇచ్చారని చెప్పారు. జగన్‌పై సిద్ధాంతపరంగానే తప్ప భౌతికంగా పోరాడడం లేదు కాబట్టే పలకరించాల్సి వచ్చిందన్నారు.

English summary
Krishna district Vijayawada city TDP president 
 
 Vallabhaneni Vamshi said he will be not leaving 
 
 Telugudesam Party. He said he was met YSR Congress 
 
 Party chief and Kadapa MP YS Jaganmohan Reddy casually.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X