• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రణబ్ ముఖం ఎర్రగా చేసుకుంటారు, మాట్లాడరు: కెసిఆర్

By Pratap
|

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణ కోసం అడిగితే సభా నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ముఖం ఎర్రగా చేసుకుంటారని, ఏమీ మాట్లాడరని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. తెలంగాణపై మాట్లాడకపోతే తమను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడం కాదు, కాంగ్రెసును తెలంగాణ నుంచి సస్పెండ్ చేస్తారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సొంత పార్టీ పార్లమెంటు సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని సభలో ప్రకటించి రెండేళ్లు దాటిందని, అయినా ఏమీ చెప్పడం లేదని ఆయన అన్నారు.

కృష్ణా జలాల పంపకం విషయంలో కృష్ణా ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వం తీరు తెలంగాణకు అన్యాయం చేసేలా ఉందని ఆయన విమర్శించారు. ఉద్యమం తీవ్రంగా జరుగుతన్న ప్రస్తుత తరుణంలోనూ తెలంగాణకు అన్యాయం చేయడానికి ఒడిగట్టిందని, ఇంకా సమైక్యంగా ఉందామని అంటారని ఆయన అన్నారు. దుర్మార్గమైన పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, సాగు నీరు తాగు నీటిలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.

కర్ణాటక కృష్ణా బేసిన్‌లోని మూడు ప్రాజెక్టులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నీటిని కేటాయించుకుందని ఆయన అన్నారు. పెన్నా నది బేసిన్‌లోని ప్రాజెక్టులకు మన రాష్ట్రం కృష్ణా నీటిని కేటాయించాలని అడిగిందని, రాష్ట్ర ప్రభుత్వం 250 టిఎంసిల నీటిని తెలంగాణకు దక్కకుండా రాయలసీమకు తరలించేందుకు ప్రయత్నించి కృష్ణా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించిందని, ఆ నీరు కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

కృష్ణా ట్రిబ్యునల్ ముందు ప్రభుత్వం ఏ వాదనలు వినిపించిందో చెప్పాలని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏది అంగీకరించిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధమైన అన్యాయం చేస్తూ పోతే తెలంగాణ భగ్గుమంటుందని ఆయన అన్నారు.

English summary
Telangana Rastra Samithi president K Chandrasekhar Rao made comment against union minister Pranab Mukherjee on telangana issue. He criticized that state government has resorted do injustice to Telangana in Krishna water distribution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X