వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూవీలో లాడెన్ ఆల్ ఖైదా దాడి ప్రణాళిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
వాషింగ్టన్: ఐరోపాలో దాడులకు ఆల్ ఖైదా పకడ్బందీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ ప్రణాళికకు సంబంధించిన పత్రాలు ఓ పోర్నోగ్రాఫిక్ మూవీలో చొప్పించినట్లు చెబుతున్నారు. 2008లో ముంబైలో జరిపిన దాడులకు మాదిరి దాడులనే ఐరోపాలో జరపాలని ఆల్ ఖైదా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వందలాది ఆల్ ఖైదా పత్రాలు సినిమాలో చొప్పించినట్లు వార్తలు వచ్చాయి.

జర్మనీ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో ఉగ్రవాద శిక్షణా మాన్యువల్స్ పిడిఎఫ్ ఫార్మాట్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు చెప్పినట్లు సిఎన్ఎన్ వార్తాకథనం సారాంశం. ఆ పత్రాల వివరాలను తాము సేకరించినట్లు సిఎన్ఎన్ తెలిపింది. బెర్లిన్‌లో నిరుడు ఆల్ ఖైదా మనిషిని అరెస్టు చేశారు. ఈ సమయంలో జర్మన్ క్రిప్టోలాజిస్టు ఆ పత్రాలను కనుక్కున్నట్లు జర్మన్ వార్తాపత్రిక డీ జీయెత్ మొదటిసారి ఆ విషయాన్ని బయట పెట్టింది.

ఆస్టియాకు చెందిన 22 ఏల్ల మక్సూద్ లోదిన్‌ను విచారణాధికారులు ప్రశ్నిస్తున్నారు. అతను పాకిస్తాన్ నుంచి బుడాపెస్టు, హంగేరి మీదుగా జర్మనీ చేరుకున్నాడు. అతను ప్యాంట్ లోపల డిజిటల్ స్టోరేజీ యంత్రాన్ని, మెమొరీా కార్డులను దాచి పెట్టుకోవడం వారిని ఆశ్చర్యపరిచింది.

దాంట్లో కిక్ ఆస్ అనే పోర్నోగ్రాఫిక్ వీడియో, సెక్సీ టాంజా అనే మార్కు చేసి ఉన్న ఫైల్ కనిపించాయి. దానికి సంబంధించిన రహస్యాన్ని చాలా వారాల తర్వాత జర్మన్ దర్యాప్తు అధికారులు కనిపెట్టారు. దాంట్లో వందకు పైగా ఆల్ ఖైదా పత్రాలున్నట్లు వారు గుర్తించారు. అందులో ఫ్యూచర్ వర్క్స్ అనే డాక్యుమెంట్ కొత్త లక్ష్యాలను, దాడులు చేయాల్సిన పద్ధతిని వివరించినట్లు సిఎన్ఎన్ తెలిపింది. దాన్ని 2009లో రాసినట్లు భావిస్తున్నారు. అది ఆల్ ఖైదా ప్రణాళికకు సంబంధించింది.

ఆ డాక్యుమెంట్ రాసిన తర్వాత ఏడాదికి జర్మనీ, ఇతర ఐరోపా దేశాల్లో ముంబై తరహా దాడులకు ప్రణాళికలు వేసినట్లు ఐరోపా నిఘా సంస్థలు గుర్తించాయి. ఫ్యూచర్ వర్క్స్‌కు సంబంధించిన పత్రం ఆ దాడులకు సంబంధించిన ప్రణాళిక అయి ఉంటుందని ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు యాసిన్ ముషర్బాష్ చెప్పారు. అతనే ఆ రహస్య పత్రాలకు సంబంధించి మొదటిసారి రాశారు. అయితే, అందులో తేదీలు గానీ, నిర్దిష్టమైన ప్రణాళికలు గానీ లేవు. అది తమ కార్యకర్తలను దాడులకు సమాయత్తం చేయడానికి ఉద్దేశించిందై ఉంటుందని అంటున్నారు.

English summary
Hundreds of internal al Qaeda documents embedded inside a pornographic movie on a memory disk have revealed plots of carrying out attacks in Europe similar to the November 2008 Mumbai attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X