వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై మేం లేఖ ఇచ్చాం: లోకసభలో నామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Nama Nageswar Rao
న్యూఢిల్లీ: తెలంగాణపై తాము ఎప్పుడో లేఖ ఇచ్చామని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు చెప్పారు. ఆయన బుధవారం లోకసభలో మాట్లాడారు. తమ పార్టీ తెలంగాణపై లేఖ ఇవ్వలేదని, పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వాలని ఎవరో అంటున్నారని, తాము ఎప్పుడో లేఖ ఇచ్చామని ఆయన చెప్పారు. తెలంగాణపై తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

తెలంగాణపై కేంద్ర వైఖరి ఏమిటో, కాంగ్రెసు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆందోళనవల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, తెలంగాణ సమస్యను నాన్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తారో, ఇవ్వరో తేల్చి చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అంశాన్ని తేల్చకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వ వైఖరి వల్ల తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో నామా నాగేశ్వర రావు కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిశారు. తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

తమ పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవి హత్య సంఘటనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాత్ర ఉందని నామా నాగేశ్వర రావు లోకసభలో ఆరోపించారు. ఈ విషయంపై గతంలో సిబిఐ దర్యాప్తు చేసిందని, అయితే అప్పుడు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కేసు నుంచి తన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తప్పించారని ఆయన అన్నారు. వైయస్ జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

English summary
Telugudesam MP Nama Nageswar Rao said that his party has submitted a letter on Telangana issue. He said that the UPA government should take responsibility of solving Telangana issue. He also met home minister Chidambaram on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X