కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెస్ట్ తీసుకో: డిఎల్‌ను తప్పుపట్టిన వీరశివా, అహ్మదుల్లా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veera Siva Reddy - Ahmadullah
కడప: ఉప ఎన్నికలతో సంబంధం లేదని తేల్చి చెప్పిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులపై ఎందుకు మాట్లాడుతున్నారని కమలాపురం శాసనసభ్యుడు వీర శివా రెడ్డి బుధవారం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన శాఖలను తగ్గించడంతో ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు.

డిఎల్ రవీంద్రా రెడ్డి రాజకీయాలలో అలసిపోతే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని సూచించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ లేకుండా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు.

అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ ఏకపక్షంగా వ్యవహరించలేదని మంత్రి అహ్మదుల్లా అన్నారు. ఆయా నియోజకవర్గాల కార్యకర్తలను సంప్రదించిన తర్వాతనే అభ్యర్థులను ఖరారు చేశారని చెప్పారు. డిఎల్ రవీంద్రా రెడ్డి అంటే తనకు గౌరవం ఉందని అందుకే ఆయనకు వ్యతిరేకంగా తాను మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.

ఉప ఎన్నికలలో ఆయన కాంగ్రెసుకు సహకరిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికపై మాకు ఎలాంటి అసంతృప్తి లేదని తేల్చి చెప్పారు. అభ్యర్థుల ఎంపిక సజావుగా, సక్రమంగా జరిగిందని చెప్పారు. ఉప ఎన్నికల తర్వాత తాను కాంగ్రెసు పార్టీని వీడతాననే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. తన శరీరంలో ప్రవహించేది కాంగ్రెసు రక్తం అన్నారు. అభ్యర్థులను మార్చాలని తాను వాయలార్ రవికి ఎలాంటి లేఖ రాయలేదని చెప్పారు.

English summary
Minister ahmadullah and Kamalapuram MLA Veera Siva Reddy condemned minister DL Ravindra Reddy statement against chief minister Kiran Kumar Reddy and bypolls candidates of Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X