వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్ఘన్‌లో పెట్రేగిన టెర్రరిస్టులు, ఒబామా వెళ్లిన గంటల్లో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Barack Obama
కాబూల్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసాబా బిన్ లాడెన్ మృతి చెంది సంవత్సరం అయిన సందర్భంగా అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వచ్చి వెళ్లిన గంటల్లో ఉగ్రవాదులు బుధవారం రెచ్చిపోయారు. ఒబామా అక్కడ ఆకస్మికంగా పర్యటించారు. ఆయన అక్కడి నుండి వెళ్లిన రెండు గంటల తర్వాత ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు చేశారు. కాబుల్‌లోని జలాలాబాద్ రోడ్డులో ఉన్న సుప్రీం మాల్ ఎదుట రెండు కారు బాంబు పేలుళ్లు జరిగాయి.

ఈ పేలుళ్లు అమెరికా సైనిక స్థావరానికి అతి దగ్గరలో చోటు చేసుకున్నాయి. దీంతో అమెరికా సైన్యంలో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. అయితే ఒబామా వెళ్లిన తర్వాత దాడులు జరగడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృత చెందగా, సుమారు 150 మందికి పైగా గాయపడ్డారు. సైనికులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

గ్రీన్ విలేజ్ కాంప్లెక్స్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. ఒక పేలుడు సంభవించిన కాసేపటికి మరో పేలుడు జరిగింది. ఈ పేలుళ్లకు తాలిబన్ సంస్థ బాధ్యులుగా ప్రకటించుకుంది. గ్రీన్ విలేజ్ కాంప్లెక్స్‌లో పలు విదేశీ మిలిటరీ సంస్థలు ఉంటాయి.

కాగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆఫ్ఘనిస్తాన్‌లో అకస్మికంగా పర్యటించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఆయన వచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో భద్రతా ఒప్పందంపై సంతకాలు చేశారు. 2014లో నాటో మిషన్ పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఒప్పందంపై ప్రధాన్యత ఏర్పడింది.

English summary
Hours after US President Barack Obama's visit to the nation, the capital of Afghanistan - Kabul was rocked by multiple bomb-blasts on Wednesday, May 2 - the first death anniversary of Osama bin Laden. A suicide car bomb attack followed by massive gunfire stranded Jalalabad road area. Target of the multiple explosions was Green Village complex, informed Kabul police chief. Several foreign military bases are set up in Green Village complex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X