హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామలింగరాజు బెయిల్‌కు భానుకిరణ్‌తో 20 కోట్ల డీల్?

By Srinivas
|
Google Oneindia TeluguNews
Bhanu Kiran

హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ సిఐడి విచారణలో షాకిచ్చే నిజాలు వెల్లడిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు తెలుగు టివి ఛానళ్లలో వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. భాను కిరణ్ ఉచ్చుకు బలైన వారు కేవలం సినీ నిర్మాతలు, రాజకీయ ప్రముఖులే కాకుండా సత్యం రామలింగ రాజు తనయుడు తేజా రాజు కూడా ఉన్నట్లు సిఐడి విచారణలో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. భాను విచారణలో భయంకర నిజాలు బయటకు కక్కుతున్నారు.

సత్యం రామలింగ రాజును 2009వ సంవత్సరంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రామలింగ రాజు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాదోపవాదాల కోర్టు బెయిల్ బెయిల్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ రామలింగ రాజుకు మద్దెలచెర్వు సూరి ద్వారా బెయిల్ ఇప్పిస్తానని చెప్పి భాను కిరణ్ సత్యం రామలింగరాజు తనయుడు తేజ రాజుకు చెప్పారని తెలుస్తోంది.

తండ్రికి బెయిల్ ఇప్పించేందుకు తేజ రాజు ఇరవై కోట్లకు భానుతో డీల్ కుదుర్చుకున్నారట. అడ్వాన్సుగా భానుకు రూ.7 కోట్లు చెల్లించాడట. అయితే ఆ తర్వాత సుప్రీం కోర్టులో రామలింగ రాజుకు బెయిల్ రాలేదు. దీంతో తేజ రాజు తన తండ్రికి బెయిల్ రానందున డబ్బులు తిరిగి ఇవ్వాలని భాను కిరణ్ పైన ఒత్తిడి తీసుకు వచ్చాడట. భాను మాత్రం అతనికి రూ.2 కోట్లు చెల్లించి, మిగిలిన రూ.5 కోట్లు ఖర్చయ్యాయని చెప్పాడట.

భానుతో సత్యం రామలింగ రాజు తనయుడు తేజ రాజు లింకులు కూడా బయటపడటంతో ఆయనను సిఐడి పోలీసులు పిలిపించి విచారించే అవకాశముంది. మద్దెలచెర్వు సూరి అనుచరుడిగా చాలామంది ప్రముఖులు భాను కిరణ్‌కు రెడ్ కార్పెట్ పరిచినట్లు సిఐడి పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. కాగా భాను కేసులో ఆయనకు ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు భాను కిరణ్ కస్టడీ శుక్రవారంతో ముగుస్తోంది. దీంతో సిఐడి పోలీసులు అతనిని నాంపల్లి కోర్టుకు తరలించారు. తొమ్మిది రోజుల విచారణలోనే ఎన్నో విషయాలు వెల్లడైనందున, భానును మరికొద్ది రోజులు తమ కస్టడీకి అప్పగిస్తే మరిన్ని విషయాలు బయటపడవచ్చునను అందుకో అతనిని మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి కోర్టును కోరే అవకాశముంది.

కాగా నాంపల్లి కోర్టు భాను కిరణ్‌కు 18వ తేది వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని చర్లపల్లి జైలుకు తరలించారు.

English summary
It is said that, Bhanu Kiran, who is main accused in Maddelacheruvu Suri murder case, had links with Satyam Ramalinga Raju's son Teja Raju. According to TV channels reports, Bhanu revealed in his inquiry, about his links with Teja Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X