వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల హత్యకు మొద్దు శీనుకు కోటి: భాను కిరణ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కోసం మొద్దు శీనుకు కోటి రూపాయలు ఇచ్చినట్లు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ చెప్పాడు. సిఐడి కోర్టుకు సమర్పించిన నేరాంగీకార పత్రంలో అతను చాలా విషయాలు వెల్లడించాడు. హంద్రీనీవా ప్రాజెక్టు సెటిల్మెంట్లలో వచ్చిన డబ్బులన్నీ పంపిణీ చేశామని అతను చెప్పాడు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సూరి పేరు మీద 25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు అతను చెప్పాడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ స్నేహితుడు చిన్నాకు 9 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు భాను చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

పులివెందుల కృష్ణకు కోటీ 30 లక్షల రూపాయలు ఇచ్చినట్లు భాను కిరణ్ చెప్పాడు. జల్సాలకు 40 లక్షల రుపాయలు ఖర్చయ్యాయని అతను చెప్పాడు. సూరి సోదరి హేమలతా రెడ్డికి 40 లక్షల రూపాయలు ఇచ్చినట్లు అతను తెలిపాడు. హంద్రీనీవా 72 కోట్ల రూపాయల 7వ ప్యాకేజీ జెకె కన్‌స్ట్రక్షన్‌కు వచ్చే చూశామని, తమకు 8.6 కోట్ల రూపాయలు కమిషన్ వచ్చిందని, దాన్ని నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చామని అతను చెప్పాడు. 38 కోట్ల రూపాయల ఐదో ప్యాకేజీ కాంట్రాక్టులో సహకరించినందుకు 3.5 కోట్లు రూపాయలు తీసుకున్నామని ఆతను చెప్పాడు. ఆరో ప్యాకేజీ కూడా ఓ సంస్థకు రావడానికి సహకరించామని అతను చెప్పాడు.

సూరి హత్య తర్వాత ఉమాశంకర్ అనే వ్యక్తి 50 వేల రూపాయలు ఇచ్చాడని, అతనే సిమ్ కార్డు కూడా ఇచ్చాడని, దాంతో సూరి హత్య తర్వాత ఢిల్లీలోని శర్మ లాడ్జిలో ఉన్నానని, సింప్లెక్స్ ఉద్యోగిగా చెలామణి అయ్యాయని అతను చెప్పాడు. సూరి హత్యకు టచ్ పబ్‌లో ప్రణాళిక రచించినట్లు అతను తెలిపాడు. సినీ నిర్మాత సింగనమల రమేష్, మన్మోహన్ సింగ్‌తో కలిసి శంషాబాద్‌లో సూరి హత్యకు ఆరు రౌండ్ల టెస్ట్ ఫైరింగ్ జరిపినట్లు అతను తెలిపాడు.

శాసనసభ్యుడు గుర్నాథరెడ్డి తమ్ముడు రెడ్డప్పరెడ్డి 80 లక్షల రూపాయలు ఇచ్చాడని అతను చెప్పాడు. బెంగళూర్‌లో 2006లో ఓ సాఫ్ట్‌వేర్ డీల్ చేశామని, ఇందులో పులివెందుల కృష్ణ పాత్ర కూడా ఉందని భాను కిరణ్ చెప్పాడు. నందుల జగన్మోహన్ రెడ్డి, వంశీలతో కలిసి తొలి రియల్ వెంచర్ సెటిల్మెంట్ చేశామని, వచ్చిన డబ్బును న్యాయవాది శ్రీకాంత్ గౌడ్‌కు ఇచ్చేవాళ్లమని అతను చెప్పాడు. అన్నపూర్ణ ప్యాకేజింగ్ విషయంలోనే సూరితో విభేదాలు వచ్చినట్లు అతను చెప్పాడు.

English summary
According to news report - Bhanu Kiran, 
 
 main accused in Maddelachervu suri murder case, said that he has given crore rupees to Moddu Seenu for Paritala murder. He said that the commissions collected from Handri Neeva project contractors were distributed among individuals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X