వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చిపోయిన మావోలు: ఏఎస్ఐ కిడ్నాప్, దారుణ హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Maoists
భువనేశ్వర్: ఒడిషాలో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. మంగళవారం ఓ ఏఎస్ఐని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఒడిషా రాష్ట్రంలోని నౌపాడ జిల్లాలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. ఏఎస్ఐ కృపారాం మాఝీ జవాన్ల కోసం గౌదా గ్రామంలో తాగునీరు తీసుకు వెళుతున్న సమయంలో మావోయిస్టులు అతనిని మంగళవారం కిడ్నాప్ చేశారు.

అనంతరం అతనిని దారుణంగా కాల్చి చంపారు. ఇతను దరంభాద్‌లో ఏఎస్ఐగా పని చేస్తున్నారు. ఈ విషయంపై అంతకుముందు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) మన్మోహన్ ప్రహరాజ్ మాట్లాడుతూ.. ఏఎస్ఐ కిడ్నాప్‌కు గురయ్యారని చెప్పారు. అతనిని మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నామని అన్నారు.

దరంభాద్ పోలీస్ ఔట్ పోస్టులో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేస్తున్న కృపారాం సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌కు తీసుకు వెళుతున్న వాటర్ ట్యాంక్‌కు ఎస్కార్ట్‌గా ఉన్నాడు. ఆ సమయంలో గౌదా వద్ద పదిమంది మావోయిస్టులు వాటర్ ట్యాంకర్‌ను, అతనిని అడ్డుకున్నారు. అతనిని తమ ఆదీనంలోకి తీసుకున్నారు.

కృపారాంను తమతో తీసుకు వెళ్లి కాల్చి చంపారు. అయితే అధికారికంగా ఇంకా మావోయిస్టులు కాల్చి చంపినట్లు ప్రకటించాల్సి ఉంది. ఇటీవల ఇద్దరు విదేశీయులను, ఓ ఐఏఎస్‌ను, ఓ ఎమ్మెల్యేను ఒడిషా, చత్తీస్‌గఢ్‌లలో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే.

English summary
An assistant sub-inspector of police was on Tuesday kidnapped and killed by suspected Maoists in Odisha's Nuapada district, Times Now reported. "An ASI has been kidnapped. We suspect that the kidnappers may be Maoists," Director General of Police (DGP) Manmohan Praharaj said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X