వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మీడియా సంస్థలకు రాఘవులు బాసట

By Pratap
|
Google Oneindia TeluguNews

BV Raghavulu
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియా సంస్థల బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేయడం సరికాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. విజయవాడలోని సుందరయ్య భవన్‌లో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. జగన్ మీడియా సంస్థల అకౌంట్లను నిలిపివేయడం పత్రికా స్వేచ్ఛకు భంగం అనుకోవడం లేదని, అదే సమయంలో వ్యాపార ప్రకటనలు ఆపాల్సిన అవసరం లేదని లేదన్నారు.

జగన్ మీడియా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థదే నన్నారు. ఒకవేళ అందుకు భంగం కలిగే పరిస్థితే వస్తే అవసరమైతే విచారణ ఆపడం మంచిదని సూచించారు. ఆనాడు "ఆ రెండు పత్రికలంటూ'' వైయస్ రాజశేఖర రెడ్డి వేధించడం కూడా సమ్మతం కాకపోయినా, ఇప్పుడు అవినీతి ఆరోపణలపై విచారణ పేరిట సంస్థలను మూతపడేట్లు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.

సిపిఎ, సిపిఎంలు కొన్ని విషయాలలో కలిసి పనిచేస్తాయని, అయితే ఉప ఎన్నికల్లో సిపిఐ, తెలుగుదేశం కలయికను మాత్రం తాము సమ్మతించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని బట్టి వైఖరులు మారుతుంటాయని చెప్పారు. కాగా, విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కోస్తా జిల్లాలతోపాటు నల్గొండ, ఖమ్మం జిల్లా సీపీఎం కమిటీల విస్తృత స్థాయి రెండు రోజుల సమావేశం శుక్రవారం ప్రారంభమైంది.

ఈ సమావేశంలో చేసిన రెండు ప్రధాన తీర్మానాలను రాఘవులు వెల్లడించారు. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రవేశపెట్టేముందు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నామని చెప్పారు. ఇసుక రీచ్‌లను ఖనిజాభివృద్ధి సంస్థల ద్వారా నిర్వహింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరో తీర్మానం చేసినట్లు తెలిపారు.

English summary

 CPM secretary BV Raghavulu opposed the freezing of YSR Congress president YS Jagan's Sakshi media bank accounts. He said that CBI should take respnsibility of Sakshi media staff job security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X