వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షి మీడియా స్టాఫ్ సమాచారం అడిగిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

CBI Logo
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి గ్రూపు సిబ్బంది సమాచారం అందించాలని సిబిఐ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్లను అడిగింది. తమకు 24 గంటల్లోగా సమాచారం అందించాలని కోరుతూ సిబిఐ ఎస్పీ హెచ్ వెంకటేష్ జాయింట్ కమిషనర్లకు ఓ లేఖ రాశారు. తాను రాసిన లేఖను సీఆర్పీసి సెక్షన్ 91 కింద నోటీసుగా పరిగణించాలని ఆయన చెప్పారు.

జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, జననీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కింద పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను, ఉద్యోగ తరహాలను తెలపాలని ఆయన జాయింట్ కమిషనర్లకు సూచించారు. దర్యాప్తులో భాగంగా ఆ వివరాలను తమకు అందించాలని ఆయన సూచించారు. వర్కింగ్ జర్నలిస్టుల వివరాలతో పాటు ఇతర ఉద్యోగుల వివరాలను కూడా అందించాలని సూచించారు.

ఉద్యోగుల వివరాలతో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, సంస్థ సమర్పించిన రిటర్న్స్, తనిఖీల సమాచారం వంటి పత్రాలతో పాటు పూర్తి వివరాలు అందజేయాలని సిబిఐ ఎస్పీ వెంకటేష్ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్లకు సూచించింది. జగతి పబ్లికేషన్స్ (సాక్షి దినపత్రిక), ఇందిరా టెలివిజన్ (సాక్షి టీవీ) ఉద్యోగుల వాస్తవ సంఖ్యను సేకరించి యాజమాన్యాన్ని ప్రశ్నించే ఉద్దేశంతో ఈ వివరాలను సేకరిస్తున్నట్లు చెబుతున్నారు.

బ్యాంక్ ఖాతాల స్తంభన వల్ల 20వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారనే సాక్షి మీడియా యాజమాన్యం వాదిస్తున్న తరుణంలో సిబిఐ ఆ వివరాలు సేకరించి, సమాచారాన్ని కోర్టుకు సమర్పించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. సాక్షి మీడియాలో 20 వేల మంది పనిచేస్తున్నారనే యాజమాన్యం వాదనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పు పట్టారు. ఎక్కువలో ఎక్కువ వేయి మంది ఉద్యోగులుంటారని ఆయన చెప్పారు.

English summary
CBI has asked all the joint commissioners of labour in the state to furnish the employees' details of Sakshi group. In an urgent letter sent on Friday, CBI SP H Venkatesh virtually put the JCLs on notice by giving them 24 hours to furnish the details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X