వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షి సంస్థల ఖాతాల స్తంభన సరైందే: నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

 Narayana
విశాఖపట్నం: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మైనింగ్ మాఫియాకు కవల పిల్లల్లాంటి వారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. జగన్ మీడియా సంస్థల ఖాతాలను సీబీఐ సీజ్ చేసిన రోజు బ్లాక్‌డే కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో భారీ అవినీతికి పాల్పడిన వ్యవహారంలో ఐఏఎస్‌లను జైల్లో పెట్టి, మంత్రులను, విధివిధానాలు రూపొందించిన ఇతర రాజకీయ పెద్దలను వదిలేసిన రోజే నిజమైన బ్లాక్‌డే అని ఆయన అభివర్ణించారు. విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన నారాయణ శుక్రవారం పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

క్యాప్టివ్ అన్న పదం తీసేసిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి జైల్లో వుంటే, రాజకీయ నాయకులు బయట ఉంటున్నారని ఆయన అన్నారు. గాలి జనార్దనరెడ్డి 12 వేల కోట్లు సంపాదించాడని ఆయన చెప్పారు. "రాష్ట్రంలో సీఎం కుర్చీ తనదేనన్నట్టు జగన్ మాట్లాడుతున్నారు. అవకాశవాద రాజకీయాలే తప్ప ప్రజా సంక్షేమం పట్టని వారంతా మన నాయకులా?'' అని ఆవేదన వ్యక్తంచేశారు.

సాగు నీటి ప్రాజెక్టులు రూపకల్పన చేసిన వైఎస్ మరణించినా అవినీతి మాత్రం ఆగలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన స్తంభించిందని ధ్వజమెత్తారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ధరలు పెంచేందుకు మన ఎంపీలు ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.

రాష్ట్రం నుంచి కాంగ్రెస్‌కున్న 33 మంది ఎంపీలు గంగిరెద్దుల్లా తలలూపుతున్నారు తప్ప వారి వల్ల వీసమెత్తు ఫలితం లేదని విమర్శించారు. రాష్ట్రంలో గ్యాస్ కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని, దీనివల్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని నారాయణ ఆరోపించారు.

English summary
CPI secretary K Narayana has supported the freezing of YSR Congress president YS Jagan's Sakshi media bank accounts. He criticised YS Jagan and Karnataka former minister Gali Janardhan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X