హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షిని చదువొద్దంటారా: బాబుపై శోభా నాగిరెడ్డి ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sobha Nagireddy
హైదరాబాద్: సాక్షి దినపత్రికను చదవకూడదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. సాక్షిని చూడకూడదని, చదవకూడదని అనడం సరి కాదని ఆమె శనివారం కర్నూలు జిల్లలో అన్నారు. సాక్షి దినపత్రికను ప్రజలు చందాలు వేసుకుని నడిపిస్తారని ఆమె అన్నారు. చంద్రబాబువి దిగజారుడు వ్యాఖ్యలని ఆమె విమర్శించారు. ఉప ఎన్నికల్లో 18 స్థానాలు తమవేనని ఆమె అన్నారు.

కాగా, సిబిఐ తీరుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా మండిపడ్డారు. వైయస్ జగన్ విషయంలో ఓ ఆంగ్ల దినపత్రిక రాసినట్లే జరుగుతోందని ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సిబిఐ, కాంగ్రెసు, ఎల్లో మీడియా, చంద్రబాబు బజారుకీడ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. పార్టీని అమ్ముకున్న చిరంజీవికి జగన్‌ను విమర్శించే స్థాయి లేదని ఆయన అన్నారు. విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. సిబిఐ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాలు తమవేనని అనంతపురం జిల్లా రాయదుర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రా రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా మంత్రి రఘువీరా రెడ్డి అధికార దుర్వ్యినియోగానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్డుకుని రఘువీరా రెడ్డి అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులు, ఐఎఎస్ అధికారుల సలహాలతోనే వైయస్ జీవోలపై నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి శనివారం కరీంనగర్ జిల్లాలో అన్నారు. ఇప్పడు వైయస్ రాజశేఖర రెడ్డిని దోషిగా చిత్రీకరించడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ బతకాలంటే ప్రత్యేక రాష్ట్రంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. సాక్షి మీడియా బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయం, దానికి ప్రకటనలు నిలిపేయడం సరి కాదని ఆయన అన్నారు.

English summary
YSR Congress leader Shobha Nagi Reddy retaliated Telugudesam president N Chandrababu Naidu's comments on YS Jagan's Sakshi media. Sakshi will be run by public, if needed, She said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X