చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి పెద్ద కూతురు ఇంటిపై ఐటి దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Sushmita
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత నివాసంపై ఆదాయం పన్ను శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐటి అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుస్మిత పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

సుస్మిత నివాసంలో ఐటి అధికారులు భారీగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయం పన్ను ఎగవేశారనే సమాచారంతోనే సుస్మిత నివాసంపై ఐటి శాఖ అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. 12 మంది అధికారులతో కూడిన బృందం సుస్మిత నివాసంలో సోదాలు జరిపింది. సుస్మిత భర్త విష్ణు ప్రసాద్‌ను ఐటి అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.

చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు సుస్మిత కాగా, చిన్న కూతురు శ్రీజ. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. తన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆయన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, వాటి వివరాలను ఐటికి సమర్పించిన రిటర్న్స్‌లో పొందు పరచలేదని, అందువల్లనే ఐటి అధికారులు సుస్మిత నివాసంలో సోదాలు నిర్వహించారని అంటున్నారు. ఇంట్లో పట్టుబడిన నగదుకు సంబంధించిన వివరాలను కూడా సరిగా వెల్లడించడం లేదని తెలుస్తోంది.

English summary
IT raids were conducted on Congress Rajyasabha member megastar Chiranjeevi's elder Daughter Sushmita in Chennai capital of Tamilnadu. It is said that IT officers are grilling Sushmita's husband Vishnu Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X