వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ.ఎన్టీఆర్ విజన్ 2019: బాబుకు చెక్ పెట్టడమే లక్ష్యం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - Jr NTR
హైదరాబాద్: హీరో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా సాగుతున్నారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. శనివారం ఓ టివి ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ భేటీ, తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండటం వంటి అంశాలపై వివాదాలకు తెర దించేందుకు కాకుండా మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో ఎప్పుడూ మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ తన మామ చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు గుప్పించే వారు. బాబుది సమర్థ నాయకత్వమని, లవ్ లీ లీడర్ అని ఆకాశానికెత్తేశారు. అంతేకాదు వైస్రాయ్ ఘటనపైనా బాబును ఆయన సమర్థించారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే అధికార బదిలీ జరిగిందని తాను భావిస్తున్నానని గతంలో చెప్పారు. కానీ శనివారం నాటి ఇంటర్వ్యూలో మాత్రం అయన ఎక్కడా బాబు పేరు స్మరించలేదు. బాబాయ్ బాలయ్య పేరు మాత్రం కేవలం దమ్ము సినిమా సందర్భంగా చెప్పారు.

బాబాయ్ బాలకృష్ణ సినిమా సింహా స్ఫూర్తితోనే తాను దమ్ములో నటించానని చెప్పారు. టిడిపితో అనుబంధం కొనసాగుతుందని, తాత, తండ్రి బాటలో నడుస్తానని చెప్పారు. పార్టీని వీడే ప్రసక్తి లేదని చెప్పారు. క్రమంగా చంద్రబాబు నాయుడుకు చెక్ చెప్పే ఉద్దేశ్యంలో భాగంగానే ఆయన టిడిపిని వీడేది లేదని చెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు ఎలాగూ తండ్రి హరికృష్ణ మద్దతు ఉంది కాబట్టి పార్టీలో ఉంటూనే అటు నుండి నరుక్కు రావాలని చూస్తున్నారని అంటున్నారు.

టిడిపితో అనుబంధం, తాత, తండ్రి, బాబాయ్ పేరు స్మరించిన జూనియర్ ఎన్టీఆర్.. బాబు పేరు మాట మాత్రమైనా చెప్పక పోవడంతో అది మరింత చర్చకు దారి తీసింది. తాను ఎప్పుడు రాజకీయాలలోకి వస్తానో అని చెబుతున్నప్పటికీ పార్టీలో ఉంటూనే.. 2019 విజన్‌ లక్ష్యంగా జూనియర్ పని చేస్తున్నారని అంటున్నారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత ఆ ఫలితాలను అనుసరించి తన భవిష్యత్తు ప్లాన్‌ను రెడీ చేసుకునేందుకు సిద్దమవుతున్నారని అంటున్నారు.

English summary
It is said that, Hero Jr.NTR is moving strategically on telugudesam Party and party chief Nara Chandrababu Naidu. Some are suspecting his statement in a TV channel interview is showing to put check to Chandrababu Naidu in party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X