విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంద్రకీలాద్రిపై మృతదేహం: ప్రమాదంలో సజీవ దహనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Krishna Map
నల్గొండ/శ్రీకాకుళం/విజయవాడ: నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. పదిమంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న టిప్పర్‌ను విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రయివేటు వోల్వో బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకొని బస్సు డ్రైవర్‌తోపాటు ఓ ప్రయాణీకురాలు సజీవ దహనమయ్యారు.

బస్సు అంతటికీ మంటలు వ్యాపించడంతో ప్రయాణీకులు కిటికీ అద్దాలు పగులగొట్టి కిందకు దూకారు. మృతురాలు పశ్చిమ గోదావరి జిల్లా సత్రంపాడుకు చెందిన శారదగా గుర్తించారు. క్షతగాత్రులను హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ బస్సు అంజనీ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా తెలుస్తోంది. బస్సులో మొత్తం నలభై నాలుగు మంది ప్రయాణీకులు ఉన్నారు. విజయవాడకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో ఎన్‌హెచ్-9పై కొద్ది సేపు భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెంలో నిద్రిస్తున్న వారిపై నుంచి ఓ లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు. వరంగల్ జిల్లా హసన్‌పర్తి వద్ద ఓ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.

మరోవైపు కృష్ణా జిల్లా ఇంద్రకీలాద్రిపై ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అన్నదాన సత్రం వాటర్ ట్యాంకులో మృతదేహాన్ని పోలీసులు ఉదయం గుర్తించారు. మూడు రోజుల క్రితమే ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఈ మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రోజులుగా నీరు దుర్వాసన రావడంతో భక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో వెలుగులోకి వచ్చింది. ఇది హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంద్రకీలాద్రిలో మూడు వాటర్ ట్యాంకుల ద్వారా నీరు వస్తుంది. వీటిని తాగడానికి, ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తారు.

English summary
Unkown dead body found in Indrakeeladri water tank on Monday morning. Police filed case and started enquiry. A volvo bus from Hyderabad to Vijayawada, collaided with a tipper at Kaithapuram of Nalgonda district on Sunday mid nitht. Bus driver and a woman dead in this accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X