చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూతురింట్లో డబ్బు: తమిళనాట చిరంజీవి పేరే, ఢిల్లీలో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
చెన్నై/హైదరాబాద్: ఇటీవల ఆదాయపు పన్ను శాఖ జరిపిన దాడులలో రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ శాసనసభ్యుడు చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో దొరికిన రూ.35 కోట్లకు సంబంధించి తమిళనాడు పత్రికలలోనూ చిరంజీవి పేరే ప్రధానంగా కనిపిస్తోంది! చెన్నైలోని చిరంజీవి కూతురు సుష్మిత ఇంటి నుండి ఐటి శాఖ ఈ డబ్బును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుష్మిత ఇంట్లో భారీ మొత్తంలో డబ్బులు దొరకడం ఆంధ్ర ప్రదేశ్‌లో పతాక శీర్షికలకెక్కింది. రాజకీయ వర్గాల్లోనూ దీనిపై చర్చ జరిగింది.

తమిళనాడులో కూడా చిరంజీవి పేరుతోనే పతాక శీర్షికలకు ఎక్కింది. కాగా ఇటీవల తమిళనాడు సాధారణ ఎన్నికల ప్రచారంలో చిరంజీవి కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. తెలుగువారు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. అదే సమయంలో దక్షిణాది నుండి ఉన్న ప్రముఖ హీరోలలో చిరంజీవి కూడా ఒకరు. కాబట్టి తమిళనాడులోనూ ఆయన సుపరిచితులు. దీంతో చిరు కూతురింట్లో, చిరు వియ్యంకుడి ఇంట్లో ఐటి శాఖ డబ్బులు స్వాధీనం చేసుకున్నదని చెప్పారు.

కాగా డబ్బు దొరికిన అనంతరం చిరంజీవి హఠాత్తుగా న్యూఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలవడం కూడా చర్చకు దారి తీసింది. ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఇంత అర్జెంటుగా మంగళవారం ఢిల్లీకి ఎందుకు వెళ్లారని కడప పార్లమెంటు సబ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తన వియ్యంకుడి ఇంటిలో దొరికిన డబ్బు కేసు నుంచి గట్టేక్కేందుకే ఆయన ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి వాయలార్ రవిని ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు తమ ఇంట్లో దొరికిన డబ్బుకు చిరంజీవి వియ్యంకుడి కుటుంబం ఇప్పటి వరకు లెక్కలు చెప్పలేదని తెలుస్తోంది. చిరు కుమార్తె ఇంటి నుండి ఐటి శాఖ స్వాధీనం చేసుకున్న రూ.35 కోట్లను మంగళవారం రిజర్వ్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును ఐటి శాఖ తమ వద్దే ఉంచుకొని సంబంధింత వ్యక్తులకు లెక్కలు చెప్పేందుకు మూడు రోజులు గడువిస్తుందని, ఆ వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన ఆర్‌బిఐలో జమ చేస్తుందట. దొరికిన నగదుకు సరైన లెక్కలు చూపితే కేవలం ఐడి దాడులకు సర్వీస్ ట్యాక్స్ మాత్రమే వసూలు చేస్తారట.

English summary

 Rajyasabha Member and Tirupati former mla Chiranjeevi went to New Delhi on Tuesday after raiding in his daughter Sushmitha's residence in Chennai. He met union minister Vayalar Ravi on tuesday evening. They talk about bypolls in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X