వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్త నమూనాలపై తివారీకి హైకోర్టు ఫైనల్ వార్నింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

ND Tiwari
న్యూఢిల్లీ: పితృత్వం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీకి ఢిల్లీ హైకోర్టు బుధవారం తుది అల్టిమేటం ఇచ్చింది. రోహిత్ శేఖర్ దాఖలు చేసిన పితృత్వం దావా ప్రొసీడింగ్స్‌ను నిలిపేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసి పుచ్చింది. ఈ నెల 21వ తేదీన లేదా ఈలోగా రక్తనమూనాలను ఇవ్వడానికి ముందుకు రాకపోతే పోలీసు సహాయం తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో డిఎన్ఎ పరీక్ష కోసం రక్త నమూనాను ఇవ్వాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు మరోసారి తివారీని ఆదేశించింది. రక్త నమూనాను స్వచ్ఛందంగా ఇస్తారా, లేదా అనే విషయాన్ని రెండు రోజుల్లో తేల్చాలని ఆదేశించింది. రక్త నమూనాను ఇచ్చే వరకు దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు తివారీని ఆదేశించింది. ఈ మేరకు తివారీ బుధవారం రక్త నమూనా ఇవ్వాల్సి ఉంది.

తనను తివారీకి పుట్టిన బిడ్డగా ప్రకటించాలని కోరుతూ రోహిత్ శేఖర్ అనే యువకుడు దావా వేశాడు. అది తివారీ మెడకు చుట్టుకుంది. రోహిత్ శేఖర్ వాదనలోని నిజాన్ని తెలుసుకోవడానికి రక్త నమూనా ఇవ్వాలని కోర్టు తివారీని అదేశించింది. అయితే, తివారీ అందుకు ముందుకు రాకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు. తివారీ స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే బలవంతంగా రక్తం నమూనాను సేకరించాలని కూడా కోర్టు ఆదేశించింది. తివారీ రక్తం నమూనాను పోలీసుల సహకారంతో తీసుకోవడానికి ఓ కమిషనర్‌ను నియమించాలని రోహిత్ శేఖర్ కోర్టును కోరారు.

పితృత్వం కేసులో డిఎన్ఎ పరీక్ష నిమిత్తం రక్తం నమూనాను ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఎన్డీ తివారీ డిఎన్ఎ పరీక్ష కోసం రక్తం నమూనాను ఇవ్వాల్సిందేనని, అవసరమైతే పోలీసు సహాయం తీసుకుని బలవంతంగా తివారీ రక్తాన్ని తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. రోహిత్ శేఖర్ అనే యువకుడు - తివారీని తన తండ్రిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ దాఖలుచేశాడు. తన తల్లి ఉజ్వల శర్మతో లైంగిక సంబంధాలు పెట్టుకున్న తివారీకి తాను జన్మించానని అతను వాదిస్తున్నాడు.

దాంతో ఎన్డీ తివారీకి డిఎన్ఎ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అయితే, పితృత్వ పరీక్షలకు తివారీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది తన ప్రైవసీని దెబ్బ తీసే చర్య అని ఆయన అభివర్ణించారు. ఆ వాదనలను కోర్టు తిరస్కిరించింది.

తివారీయే తన అసలు తండ్రి అని వాదిస్తున్న రోహిత్ శేఖర్ (31), ఆయన తల్లి ఉజ్వల ఇంతకు ముందు మరో వైపు నుంచి నరుక్కొచ్చారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ, ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఉజ్వల భర్త బీపీ శర్మకు డీఎన్ఏ పరీక్షలు జరిపించారు. ఈ నివేదికను సీల్డ్ కవర్‌లో ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. నివేదికను జస్టిస్ రేవా ఖేత్రపాల్ కోర్టులో చదివి వినిపించారు.

రోహిత్ డీఎన్ఏ తల్లి ఉజ్వలతో సరిపోలుతోందని, ఆమె భర్త బీపీ శర్మతో సరిపోలడంలేదని తెలిపారు. దీంతో ఉజ్వల, బీపీ శర్మల బంధం వల్ల రోహిత్ జన్మించలేదని రుజువైంది. 'తివారీయే నా తండ్రి' అన్న రోహిత్ వాదనకు బలం చేకూరింది.

English summary
In a setback for veteran Congress leader and Andhra Pradesh former governor ND Tiwari, the Delhi High Court on Wednesday rejected his plea to stay proceedings in connection with a paternity suit filed by Rohit Shekhar, who claims to be his biological son.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X