హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెనీవాలో రూ. 50 కోట్లు పలికిన గోల్కొండ వజ్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

Golconda Fort
జెనీవా: చారిత్రక ప్రాధాన్యం గల హైదరాబాద్ వజ్రం జెనీవా వేలం పాటలో 9.7 మిలియన్ల అమెరికా డాలర్లు పలికింది. ఇది రూ. 50 కోట్ల విలువ ఉంటుందని అంచనా. తరం నుంచి తరానికి మారుతూ ఆ వజ్రం ఐరోపా రాజవంశానికి చేరింది. చారిత్రకమైన గోల్కొండ నగరానికి చెందిన బుయో సాన్సీ వజ్రం జెనీవా వేలం పాటలకు వచ్చింది.

1610లో నాలుగో హెన్రీ 35 క్యారట్ల ఆ వజ్రాన్ని ఆయన సహవాసి మేరీ డీ మేడిసి ధరించారు. సోత్ బై వేలం పాటలో ఈ వజ్రాన్ని ఉంచారు. ఇది అత్యంత అరుదైన, అత్యంత సుందరమైన వజ్రమని సోత్‌బై ఇండియా డైరెక్టర్ మైథిలీ పరేఖ్ అన్నారు. గోల్కొండ నగరం పరిసరాల్లోని గనుల్లోనే ఈ వజ్రం జనించి ఉంటుందని అన్నారు. హోప్, కోహినూర్, రీజెంట్ వజ్రాల స్థాయి దీనికి ఉంటుందని భావిస్తున్నారు.

సోత్‌బై వేలం పాటలో ఐదుగురు ఆ వజ్రం కోసం పోటీ పడినట్లు తెలుస్తోంది. వీరు మూడు వేర్వేరు ఖండాలకు చెదినవారని తెలుస్తోంది. దాన్ని ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే, అతను ఎవరనేది తెలియడం లేదు.

నిజాం ప్రభువుల రాజధాని గోల్కొండ కోట (ఇప్పటి హైదరాబాద్ నగరం) అత్యంత చారిత్రకమైంది. సంపదకు నిలయం. నిజాం ప్రభువుల ఎనలేని సంపద ఉండేదని ఆధారాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా నిజాం ప్రభువు మన్ననలు పొందాడు. వజ్రవైఢూర్యాలు లెక్కకు మిక్కిలిగా ఉండేవని అంటారు.

English summary
A historic centuries-old diamond passed down through generations of European royalty was sold for USD 9.7 million at auction in Geneva. Beau Sancy, an important diamond originally from the Indian city of Golconda (modern day Hyderabad) came under the gavel at Sotheby's auction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X