హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

28న పిచ్చివేషాలు వేస్తే: జగన్‌కు పాలడుగు వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paladugu Venkat Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని శాసన మండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు గురువారం హెచ్చరించారు. ఆయన సిఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌ను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీపై జగన్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని ఆయన కార్యకర్తలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు.

జగన్ కోర్టులో హాజరయ్యే 28వ తేదీన అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్లు వచ్చిన వార్తలపై విస్మయం వ్యక్తం చేశారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దీనికి దీటుగా జవాబివ్వాలని స్పష్టం చేశారు. ఇలాంటి పిచ్చివేషాలు వేస్తే తిప్పికొడతామని, తదనంతర పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనీ హెచ్చరించారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. రాజకీయాలు ఎంత వరకు మాట్లాడవచ్చునో అంత వరకే మాట్లాడాలని జగన్‌కు సూచించారు. జగన్ ఏం మాట్లాడినా సర్దుకు పోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. దేశంలో ఎవరూ చేయని తప్పులు జగన్ చేశారన్నారు. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని నీతి నియమాలు లేనివాడిగా జగన్ చిత్రీకరించారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటే పెద్ద క్రిమినల్ ఎవరూ లేరని మరో ఎమ్మెల్సీ రంగారెడ్డి అన్నారు.

చట్టపరంగానే జగన్ ఆస్తుల జప్తు జరుగుతుందని మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. తన ఆస్తుల కేసులో జగన్ సిబిఐ కోర్టులో హాజరై తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. పితాని సత్యనారాయణ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

English summary

 Congress Party MLC Paladugu Venkat Rao warned YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy on Thursday. He called party activists to react on YSR Congress party leaders allegations on Congress and chief minister Kiran Kumar Reddy. He said, no one in Congress party to adjest on Jagan statements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X