వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంగ్మాను ముందుకు తెచ్చిన నవీన్: జయ మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

PA Sangma
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి లోకసభ మాజీ స్పీకర్, ఎన్సీపి సీనియర్ నేత పిఎ సంగ్మా పేరును ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ముందుకు తెచ్చారు. నవీన్ పట్నాయక్ ప్రతిపాదనకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్దతు పలికారు. తమ పార్టీ సంగ్మాకు మద్దతు ఇస్తుందని, తాను జయలలితతో ఈ విషయంపై మాట్లాడానని, జయలలిత కూడా మద్దతు పలుకుతున్నారని నవీన్ పట్నాయక్ గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

దేశంలోని అత్యున్నత పదవికి సంగ్మా అర్హుడని తాను భావిస్తున్నామని, రాష్ట్రపతి భవన్‌కు వెళ్లడానికి సంగ్మా అర్హుడని ఆయన అన్నారు. తాను సంగ్మా నుంచి లేఖ అందుకున్నానని, దీనిపై జయలలితతో మాట్లాడానని, తమ పార్టీ సీనియర్ నేతలను సంప్రదించానని ఆయన అన్నారు. లోకసభ స్పీకర్ పదవిని చేపట్టి సంగ్మా ప్రతిష్టాత్మకమైన గిరిజన నాయకుడని ఆయన అన్నారు.

వారం రోజుల క్రితం నవీన్ పట్నాయక్ చెన్నై వెళ్లారు. చెన్నైలో ఆయన జయలలితతో సమావేశమయ్యారు. ఈ తర్వాత ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా సంగ్మాకు మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. నవీన్ పట్నాయక్‌ను జయలలిత తన సోదరుడిగా చెప్పుకున్నారు. అప్పుడే ఇరు పార్టీల మధ్య సయోధ్యకు ఓ అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు.

2014 సాధారణ ఎన్నికలకు ముందు బిజెపియేతర, కాంగ్రెసేతర జాతీయ ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ఇది ప్రాతిపదిక అవుతుందని అంటున్నారు. యుపిఎను అవినీతిమయంగా, ఎన్డీఎను మతతత్వ కూటమిగా నవీన్ పట్నాయక్ అభివర్ణించారు. సంగ్మా కూతురు, కేంద్ర సహాయ మంత్రి ఆగాథా సంగ్మా ఇంతకు ముందు భువనేశ్వర్‌లో సంగ్మాను కలిశారు.

గిరిజన నాయకుడిని రాష్ట్రపతిగా చేయాలని సంగ్మా ఇంతకు ముందు అన్నారు. ఇప్పటి వరకు గిరిజన నాయకుడు రాష్ట్రపతి కాలేదని ఆయన అన్నారు. అయితే తాను అభ్యర్థిని కానని ఆయన చెప్పారు. గిరిజన నాయకుడిని రాష్ట్రపతి అభ్యర్థిగా అంగీకరించాలనే విషయంపై సూత్రబద్దమైన అంగీకారం కోసం వివిధ పార్టీల అభిప్రాయాలను కూడగడుతున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Former Lok Sabha speaker and NCP leader PA Sangma has joined the Presidential poll fray after the BJD and AIADMK promised their support to Sangma for the top post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X