వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిర్డీ సాయిబాబా వద్ద 280 కిలోల బంగారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Shiridi Sai Baba
షిర్డీ: ఇద్దరు భక్తులు శుక్రవారం షిర్డీ సాయిబాబాకు 60 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. షిర్డి సంస్థాన్ వర్గాలు శుక్రవారం ఈ విషయాన్ని చెప్పారు. ఢిల్లీకి చెందిన భక్తుడు 1.5 కిలోల బంగారం గంటను, ముంబైకి చెందిన భక్తుడు 900 గ్రాముల బంగారం కుండను విరాళంగా ఇచ్చారు.

గత ఐదేళ్ల నుంచి షిర్డీ సాయిబాబాకు పలు బంగారం వస్తువులను భక్తులు విరాళంగా ఇస్తున్నారు. దీంతో సాయిబాబా కోశాగారంలో ప్రస్తుతం 280 కిలోల బంగారం చేరింది. వెండి 3,000 కిలోలు ఉంది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు ఉన్నాయి.

ఓ సాయి భక్తుడు 570 గ్రాముల బరువు తూగే బంగారం కిరీటాన్ని విరాళంగా ఇచ్చాడు. దీని విలువ రూ. 14 లక్ష 88 వేలు ఉంటుందని సమాచారం. మహారాష్ట్రలో షిర్డీలోనే సాయి బాబా జన్మించాడని భావిస్తారు. అది ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన యాత్రా స్థలంగా మారింది. సాయిబాబా 1918 అక్టోబర్ 15వ తేదీన జన్మించారు. ఆయనను ముస్లింలు, హిందువులు కూడా ఆరాధిస్తారు. ఆయనను సన్యాసిగా చెబుతారు.

హిందువులు సాయిబాబాను కృష్ణుడి అవతారంగా భావిస్తారు. ఈ విషయాన్ని హేమద్ పంత్ అనే అతను శ్రీ సాయి సచ్చరిత్ర పుస్తకంలో రాశారు. కొంత మంది భక్తులు దత్తాత్రేయుడి అవతారంగా చెబుతారు. చాలా మంది భక్తులు మాత్రం సద్గురుగా కొలుస్తారు.

English summary
wo devotees Friday donated Sri Sai Baba gold worth Rs 60 lakh at his temple here, Shirdi Sansthan sources said. A devotee from Delhi donated a 1.5 kg gold bell, while a person from Mumbai offered a 900 gm gold pot before Sri Sai Baba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X