రైల్వే బ్రిడ్జి కింద మందు పాతరలు, రైల్లో మంటలు

మందు పాతరలను గుర్తించడంతో పెద్ద మూప్పు తప్పిందని ఆయన అన్నారు. మందు పాతరలను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. డెటనేటర్లు, ఫ్యూజు వైర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకే తనిఖీలు చేపట్టామని కాంతారావు అన్నారు. ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆయన చెప్పలేదు. మావోయిస్టులే ఈ మందుపాతరలను అమర్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలావుంటే, హైదరాబాదులోని ఫలక్‌నుమా రైల్వే స్టేషన్ వద్ద ఓ లోకల్ రైలు అగ్ని ప్రమాదానికి గురైంది.
ఫలక్ నుమా రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ప్రయాణికులకు ఏ విధమైన అపాయం సంభవించలేదు. ఫైరింజన్లు మంటలను ఆర్పాయి. మంటలకు మూడు బోగీలు కాలిపోయాయి.
సాంకేతిక లోపం వల్లనే రైలులో మంటలు లేచినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంతో శంషాబాద్, సికింద్రాబాద్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.












Click it and Unblock the Notifications