పోమర్స్‌బ్యాచ్‌కు బెయిల్: సిద్ధార్థ మాల్యాకు నోటీసు

మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నవిత కుమారి బాఘాకు ఢిల్లీ పోలీసులు సంఘటనకు సంబంధించిన సిసిటివి ఫుటేజ్‌ని చూపించారు. తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సమయంలో సిసిటివీ ఫుటేజ్‌ను సమర్పించాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం వారు దాన్ని సమర్పించారు. పోమర్స్ బ్యాచ్ బలవంతంగా తన గదిలోకి ప్రవేశించి, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని జోహైల్ హమీద్ ఆరోపించింది. నిరోధించేందుకు ప్రయత్నించిన ఆమె కాబోయే భర్త సాహిల్ పీర్జాదాపై ఆటగాడు చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇదిలావుంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ యజమాని సిద్ధార్థ మ్యాల్యా చిక్కుల్లో పడ్డారు. తన వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అమెరికా మహిళ నోటీసు జారీ చేసింది. మాల్యా బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ తన న్యాయవాది జితేందర్ గార్గ్ ద్వారా జోహైల్ హమీద్ లీగల్ నోటీసు ఇచ్చింది.
సిద్ధార్థ మాల్యా సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని, మాల్యా క్షమాపణ చెప్పడానికి నిరాకరిస్తే పరువు నష్టం దావా వేస్తానని ఆమె చెప్పింది. తన ఫియాన్సీని కొట్టాడని చెబుతున్న మహిళ రాత్రంతా తన చుట్టూ తిరుగుతూ ఉందని మాల్యా ట్వీట్ చేశాడు. తన బ్లాక్ బెర్రీ మెసెంజర్ కూడా అడిగిందని ఆయన ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications