హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జూ.ఎన్టీఆర్ రాజకీయాల నుండి దృష్టి మరల్చారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: హీరో జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ఆరంగేట్రంపై వెనక్కి తగ్గారా అంటే అవుననే అంటున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయాల పైన ఏమాత్రం దృష్టి సారించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల దమ్ము సక్సెస్ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, అంతకముందు విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

వల్లభనేని వంశీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం తెలుగుదేశం పార్టీలో దుమారం రేపింది. రాజకీయ వర్గాల్లో అది తీవ్ర చర్చకు దారి తీసింది. వంశీ ఏ క్షణంలోనైనా జగన్ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత వంశీ దానికి వివరణ ఇచ్చి తెరదించారు. అయితే జగన్‌ను వంశీ కలవడం వ్యూహాత్మకంగానే జరిగిందని, ఆయన వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనే ప్రచారం జరిగింది.

గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కుమార్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు రావడానికి పార్టీ ప్రయత్నాలు చేసినప్పటి నుండి చంద్రబాబుకు, జూనియర్ ఎన్టీఆర్‌తో, హరికృష్ణతో విభేదాలు పొడసూపాయి. ఆ తర్వాత పలు సందర్భాలలో హరికృష్ణ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తి జూనియర్ కోసమే అన్న వాదన ఉంది. జూనియర్ కూడా గత మహానాడులో పాల్గొనకపోవడం తదితర కారణాల వల్ల ఆయన పార్టీకి దూరమవుతున్నారనే అభిప్రాయాలు వెలువడ్డాయి.

పార్టీకి దూరం, వల్లభనేని వంశీ ఇష్యూ తదితర అన్నింటికి జూనియర్ దమ్ము సక్సెక్ ముఖాముఖిలో చెప్పాడు. అయితే ఆయన తన బాబాయి బాలకృష్ణ, తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు, తండ్రి హరికృష్ణ పేర్లను ప్రస్తావించారు. కానీ చంద్రబాబు పేరు మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఇది కూడా చర్చనీయాంశమైంది. వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ క్రమంగా తగ్గుతోన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.

తాను టిడిపికే పని చేస్తానని ఎన్టీఆర్ చెబుతుండగా, కుటుంబం మధ్య ఎలాంటి విభేదాలు లేవని పార్టీ నేతలు చెబుతున్నారు. జూనియర్ తాజాగా రాజకీయాలపై ఆసక్తిని తగ్గించుకొని సినిమాలకే పరిమితం అవుదామనే అభిప్రాయానికి వచ్చారట. ఈ కారణంగానే వారి మధ్య విభేదాలు తగ్గాయని అంటున్నారు. కొన్నేళ్ల పాటు రాజకీయాలు పట్టించుకోవడం మానేసి కేవలం సినిమాల పైనే ప్రత్యేకంగా దృష్టి సారించాలని భావిస్తున్నారట.

ముఖాముఖి కార్యక్రమంలో ఎన్టీఆర్ కూడా ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. తన వయస్సు ఇరవయ్యేనిమిదేళ్లని, తాను రాజకీయాల్లోకి మరో ఇరవయ్యేళ్లకు వస్తానే, ఇరవయ్యయిదేళ్లకు వస్తానో అసలు రాకపోవచ్చునని చెప్పారు. ఆయన ఈ వ్యాఖ్యలు వ్యూహాత్మకంగానే చేశారని, 2019 టార్గెట్‌గా పెట్టుకొని చేశారని, ఎస్సెమ్మెస్‌ల ప్రభావమని తదితర వ్యాఖ్యానాలు వినిపించాయి. తాజాగా ఆయన సినిమాల పైన దృష్టి సారించేందుకే వెనక్కి తగ్గారని అంటున్నారు. మరి జూనియర్ ఎందుకు తగ్గారో భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

English summary
It is said that, Hero Junior Ntr is not interested on politics now. He finally broke his prolonged silence over the reports about his rifts with his Babai Balakrishna and uncle Telugudesam Party president N Chandrababu Naidu recent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X