హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఐటి సాధించిన ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రూ. 50 వేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy-IIT Students
హైదరాబాద్: ఐఐటి - జెఇఇలో ఉత్తీర్ణత సాధించి ఐఐటిలో అర్హత సాధించిన 18 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూ. 50 వేల నగదును ప్రకటించారు. ఐఐటి - జెఇఇలో ఆర్హత సాధించిన హైదరాబాదులోని నాగోలుకు చెందిన ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ ఆశ్రమ జూనియర్ కళాశాల విద్యార్థినీవిద్యార్థులు సోమవారం ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్‌తో కలిసి సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా పది వేల రూపాయలు ఇచ్చేది. ఈసారి దాన్ని పెంచారు. నిరుడు ఇదే కళాశాలకు చెందిన పది మంది విద్యార్థులు ఐఐటి - జెఇఇలో ఆర్హత సాధించగా ఈ ఏడాది 18 మంది విద్యార్థినీ విద్యార్థలు అర్హత సాధించారు. మొత్తం 52 మంది విద్యార్థుల్లో 18 మంది ఐఐటికి అర్హత సాధించగా మిగిలినవారు ఎఐఇఇఇలో మంచి ఫలితాలు సాధిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు.

ఐఐటి - జెఇఇలో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి అభినందించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలు వారి కుటుంబ సభ్యులకే కాకుండా రాష్ట్రానికి కూడా గర్వకారణమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లిస్తోందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఐఐటి - జెఇఇలో అర్హత సాధించిన కళాశాలకు చెందిన 18 విద్యార్థినీ విద్యార్థులు్లో 17 మంది ఎస్సీలు కాగా, ఒకరు ఎస్టీ. వీరి తల్లిదండ్రులు కూలీలు, రైతులు, హమాలీలు, ఐకెపి వర్కర్, టైలర్, ఆటో డ్రైవర్ వంటి వృత్తులు చేస్తున్నారు. ఈ 18 మంది కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందినవారు.

English summary
The Students from A.P. Residential Junior College, New Nagole, Hyderabad who were qualified in the IIT-JEE 2012 met the Chief Minister Mr. N.Kiran Kumar Reddy at Secretariat on May 21. Sri Chukka Ramaiah, MLC and other officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X