వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ను చెప్పుతో కొట్టాలి: పాల్వాయి, నెలన్నరలోనే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Plavai Govardhan Reddy
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును రోజూ చెప్పుతో కొట్టాల్సి ఉంటుందని రాజ్యసభ సభ్యుడు పాలడుగు వెంకట్రావు సోమవారం న్యూఢిల్లీలో అన్నారు. ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను సోమవారం కలిశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే పార్టీ ప రిస్థితి మరింత మెరుగువుతుందని, అలాగే ఆంధ్రాలో కూడా తెలంగాణ అంశం కారణం గా ఏర్పడిన అనిశ్చితి తొలగిపోతుందని ప్రధానికి చెప్పినట్లు ఈ సందర్భంగా పాల్వాయి వెల్లడించారు.

తెలంగాణపై నిర్ణయం తీసుకోకుంటే ఇక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించే పరిస్థితి వస్తుందన్నారు. జగన్ ఆధ్వర్యంలో జలయజ్ఞంలో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిగాయని, దీనిపై కూడా దృష్టి సారించాలని ప్రధానికి సూచించానన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీయే చేసిందని చెప్పారు.

కాంగ్రెసుతో తెరాస చేతులు కలిపి, పరకాలలో అభ్యర్థిని ఉపసంహరించుకుంటే నెలన్నరలో తెలంగాణ వస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి హన్మకొండలో అన్నారు. మూడు నెలల్లో తెలంగాణ వస్తుందని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారని, కెసిఆర్ చెబుతున్నారని, ఆయన తమతో చేతులు కలిపితే నెలన్నర రోజుల్లోనే వస్తుందన్నారు. మా పార్టీపై అంత విశ్వాసం ఉన్నప్పుడు తమకు మద్దతిస్తే సరిపోతుందన్నారు.

కెసిఆర్ వాడుతున్న భాష విద్యలేని వాడు మాట్లాడుతున్నట్లుగా ఉందని ఆరోపించారు. ఆ మాటలన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధి విషయంలో కెసిఆర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి విసిరిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు.

English summary

 Rajyasabha Member Palvai Govardhan Reddy blamed Telangana Rastra Samithi chief K.Chandrasekhar Rao on Monday in New Delhi. He met Prime Minister Manmohan Singh and appealed to solve Telangana issue soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X