కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరకాలలో మద్దతుకు సర్వే చేస్తున్నాం: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
కరీంనగర్: వరంగల్ జిల్లా పరకాల శానససభా నియోజకవర్గంలో బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల్లో ఏ పార్టీ మద్దతు ఇవ్వాలనే విషయంపై తాము సర్వే నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్ కోదండరామ్ చెప్పారు. సర్వే ఫలితాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుని, ఏదో ఒక పార్టీకి మద్దతిస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రత్యేక ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు

గ్రానైట్ క్వారీ లీజుల అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు. ఇసుక లీజులపై తీసుకున్న చర్యలనే క్వారీలకు అమలు చేయానలి ఆయన సూచించారు. గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ వచ్చే వరకు నిరంతర పోరాటం జరుపుతామని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మూడు నెలల్లో తెలంగాణ ప్రకటించకపోతే మళ్లీ సకల జనుల సమ్మెలకు దిగుతామని హెచ్చరించారు. పోలవరం నిర్మాణ పనులు జరగనివ్వమని కోదండరాం తేల్చిచెప్పారు.

సీల్డ్ కవర్ ద్వారా ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ప్రజల మనోభావాలు తెలియవని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా సిద్ధిపేటలో తెలంగాణకు మద్దతుగా కొనసాగుతున్న రిలే దీక్షలకు ఆయన మంగళవారం సంఘీభావం ప్రకటించారు ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ ఈ ప్రాంత మంత్రులు, శానససభ్యులు నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు.

English summary

 Telangana political JAC convenor Kodandaram said that they are cobducting survey in Parkal assembly segment of Warangal district. He said that based on the survey results they will support either TRS or BJP at Parkal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X