విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిరుద్యోగ యువతను ముంచిన సాఫ్ట్‌వేర్ సంస్థ

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayawada
విజయవాడ: విజయవాడలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ దాదాపు 70 మంది నిరుద్యోగ యువతను ముంచి బోర్డు తిప్పేసింది. ఉద్యోగులు ఇప్పిస్తామని హామీ ఇచ్చి కోటి రూపాయల దాకా వసూలు చేసిన సంస్థ యజమానులు కనిపించకుండా పోయారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు - విజయవాడలోని పటమట ప్రాంతంలోని వికెఎస్ సొల్యూషన్స్ ప్రమోటర్స్ ఈ మోసానికి పాల్పడ్డారు.

డాటా ప్రాసెసింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వికెఎస్ సొల్యూషన్స్ ప్రమోటర్స్ మహేష్, కిశోర్, శివ యువకులు ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ఆరు నెలలలోగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తామని కూడా ప్రమోటర్స్ చెప్పారు. అయితే, వారికి ఏ విధమైన ఉద్యోగం చూపించలేదు. ఆరు నెలలు గడిచిపోయినా ఫలితం కనిపించలేదు.

ప్రమోటర్స్‌ తీరుపై అనుమానం వచ్చిన అభ్యర్థులు తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని పట్టుబడుతూ వచ్చారు. ప్రమాదాన్ని పసిగట్టిన ప్రమోటర్లలో ఒకతను ఐపి పెట్టాడని తెలుస్తోంది. ఆ తర్వాత కనిపించకుండా పోయాడని అంటున్నారు.

అభ్యర్థులు సోమవారం ఉదయం వచ్చే సరికి సంస్థ కార్యాలయానికి తాళాలు వేసి ఉన్నాయి. దాంతో వారు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
A software company allegedly duped about 70 unemployed persons by collecting Rs 1 crore from them on the promise of providing jobs before disappearing with the money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X