• search
  • Live TV
గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రతిపాడు: జగన్ పార్టీ సుచరిత గట్టెక్కుతారా?

By Pratap
|

Sucharitha
గుంటూరు: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో గట్టెక్కుతారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వయింది. 2009 ఎన్నికల్లో సుచిరత కేవలం 1,500 ఓట్ల మెజారిటీతో కాంగ్రెసు అబ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నియోజకవర్గం ముఠా కక్షలకు పెట్టింది పేరు. కమ్మ సామాజిక వర్గం మెజారిటీ ఉంటుంది. 2009లో మొదటిసారి ఆమె శాసనసభలోకి అడుగు పెట్టారు. ఆమె విజయం కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.

కాంగ్రెసు విప్ ధిక్కరించి తెలుగుదేశం పార్టీ శానససభలో ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. సుచరిత ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. ప్రత్తిపాడులో సుచరితను ఓడించడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రమే కాకుండా ఇతర కాంగ్రెసు నాయకులు కూడా ప్రత్తిపాడులో కాంగ్రెసు అభ్యర్థి కోసం ప్రచారం సాగించారు, సాగిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో పర్యటించి, పార్టీ స్థానిక నాయకులను పార్టీ అభ్యర్థి కందుకూరి వీరయ్యకు మద్దతుగా ఒకతాటి మీదికి తేవడానికి ప్రయత్నించారు. మరోవైపు, ఈ ప్రాంతానికి చెందిన మాకినేని పెద్ద రత్తయ్య మొదట్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి, అక్కడ సరిపడక తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఆయన వీరయ్య కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, మాకినేని పెదరత్తయ్యతో కొంత మంది పార్టీ నాయకులకు పడడం లేదని అంటున్నారు. ఇది సుచరితకు అనుకూలంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.

పొన్నూరు శాసనసభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర చౌదరి స్థానిక నాయకులను వెంటపెట్టుకుని చంద్రబాబును కలిశారు. వీరయ్యకు టికెట్ ఇవ్వకూడదని వారు సూచించారు. కానీ చంద్రబాబు వారి మాట వినకుండా వీరయ్యనే తిరిగి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దాన్ని ఆసరాగా తీసుకుని సుచరిత తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్మ సామాజిక వర్గంలోని ఓ గ్రూప్ సుచరితను బలపరుస్తున్నట్లు స్థానికంగా వస్తున్న సమాచారం తెలియజేస్తోంది.

కాంగ్రెసు అభ్యర్థి సుధాకర్ బాబు కోసం కాంగ్రెసు నాయకులు పెద్ద యెత్తున ప్రతిపాడులో మకాం వేశారు. రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ ఆయన విజయం కోసం కృషి చేస్తున్నారు. దీంతో కాపు ఓట్లు సుధాకర్ బాబుకు వస్తాయని భావిస్తున్నారు. ప్రతిపాడు విషయంలో కన్నా లక్ష్మినారాయణతో పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తొలుత విభేదించారు. అయితే, జిల్లాకు చెందిన కాంగ్రెసు అగ్ర నాయకులంతా ఒక తాటి మీదికి వచ్చి సుధాకర్ బాబు కోసం పనిచేస్తున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నియోజకవర్గానికి రాష్ట్రంలోని పలువురు పార్లమెంటు సభ్యులను రప్పించారు.

ఏమైనా, ప్రతిపాడులో ముక్కోణపు పోటీ ఆసక్తికరంగా ఉంది. ముగ్గురు అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని భావిస్తున్నారు. సుచిరతకు విజయం నల్లేరు బండి నడక కాదని అంటున్నారు. అయితే, వంగవీటి రాధాకృష్ణ వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు చీలి, తనకు లాభం చేకూరుతుందని సుచరిత భావిస్తున్నారు.

ఏయే సామాజిక వర్గం ఓట్లు ఎన్ని (దాదాపుగా)?

కమ్మ 53,000

కాపు 42,000

మాల 34,000

మాదిగ 17,000

రెడ్డి 18,000

యాదవులు 18,000

ముస్లింలు 12,000

ఇతరులు 18,000

మొత్తం 2,07,000

English summary
His Faction-Ridden segment is reserved for SCs but political dominated by Kammas. First-time MLA Sucharitha lacks support from even YSR Congress leaders. She won by a slender margin of 1,500 votes in 2009. People expect the fight to be between the TDP and the Congress which is likely to field the PRP loser last time, Vinay Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X