వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రో మంట: లీటరుకు రూ.7.50 పైసల పెంపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Petrol Price Hike
న్యూఢిల్లీ: పెట్రోలు ధర భారీగా పెరిగింది. లీటరుకు పెట్రోలు ధరను రూ.7.50 పైసలు పెంచారు. ఈ పెంపు బుధవారం అర్థరాత్రి నుంచే అమలులోకి రానుంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే యుపిఎ ప్రభుత్వం పెట్రోలు ధర పెంపునకు పచ్చజెండా ఊపింది. పెట్రోలు ధర పెంచక తప్పదని పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి మంగళవారం చెప్పారు. అయితే, ఇంత భారీగా పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. పెట్రోలు ధర పెంపుతో ప్రజానీకం భగ్గుమంటోంది ఈ పెంపుతో హైదరాబాదులో పెట్రోలు ధర లీటరుకు 87 రూపాయలు అయింది. అంటే తొమ్మిది రూపాయల దాకా పెరిగింది.

ఢిల్లీలో ఇప్పటి వరకు పెట్రోలు ధర లీటరకు రూ.65.64 పైసలు ఉంది. ప్రస్తుత పెంపుతో అది రూ. 73.14 పైసలు అయింది. పెట్రోలు ధరను లీటరుకు కనీసం నాలుగు రూపాయలు పెంచాలని ఒత్తిడి తెస్తూ వస్తున్నాయి. అమెరికా డాలరుపై రూపాయి విలువ గణనీయంగా తగ్గిపోవడం వల్ల కూడా పెట్రోలు ధర పెంపు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. డాలర్‌కు రూపాయి విలువ రూ.55.95 పైసలకు పడిపోయింది.

పెట్రోలు ధర పెంపుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పెట్రోలు ధర పెంపును వామపక్షాలు వ్యతిరేకించాయి. ప్రజలపై ఇది క్రూరమైన భారమని వ్యాఖ్యానించాయి. పెట్రోలు ధర పెంపు అనివార్యమైన మంగళవారం చెప్పిన జైపాల్ రెడ్డి ఎప్పుడు పెంచుతారు, ఏ మేరకు పెంచుతారనే విషయాన్ని వెల్లడించలేదు. రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత పెంచుతామని ఆయన అన్నారు. ఈలోగానే ధరను పెంచేశారు.

పెట్రోల్ ధర పెంపుపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు మండిపడుతున్నారు. ఇంత దారుణంగా పెట్రోలు ధర పెంచడాన్ని వారు మింగలేకపోతున్నారు. ధర పెరుగుదల అమలుకు ఇంకా సమయం ఉండడంతో బుధవారం సాయంత్రం నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. కాగా, యుపిఎ భాగస్వామ్య పక్షం తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ పెట్రోల్ ధర పెంపుపై తీవ్రంగా మండిపడ్డారు.

English summary
Petrol prices have been hiked by Rs 7.50 per litre effective from midnight owing to the losses suffered by oil companies.The move comes after the the Parliament's budget session that ended Tuesday. Oil companies have been pressing the government to hike petrol price by at least Rs 4 per litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X