వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా అమ్మను ముషార్రఫ్ చంపాడు: బిలావల్ భుట్టో

By Pratap
|
Google Oneindia TeluguNews

Bilawal Bhutto
ఇస్లామాబాద్‌: తన తల్లిని మాజీ సైనిక పాలకుడు పర్వేజ్‌ ముషారాఫ్‌ హత్య చేశాడంటూ దివంగత పాకిస్థానీ నేత బెనజీర్‌ భుట్టో కుమారుడు బిలావల్‌ భుట్టో జర్దారీ ఆరోపించారు. స్వదేశ రాజకీయాలలో పెద్ద పాత్రను పోషిస్తానంటూ ఆయన ప్రకటించారు. తన తల్లి 2007లో స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ముషారాఫ్‌ తన తల్లి భద్రతను ధ్వంసం చేశాడని, అయితే పాకిస్థాన్‌లో తన భద్రత గురించి తనకు విశ్వాసముందని బిలావల్‌ శుక్రవారం అన్నారు. తన తల్లి వచ్చినప్పటి ప్రభుత్వంలా కాకుండా ప్రస్తుత పాకిస్థానీ ప్రభుత్వం తనకు తగిన భద్రతను కల్పిస్తుందని తనకు విశ్వాసముందని ఒక టివి ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు.

ఆక్స్‌ఫోర్డ్‌లో చదువు పూర్తి చేసుకుని నిరుడు పాకిస్థాన్‌ తిరిగి వచ్చిన 23 ఏళ్ళ బిలావల్‌ తన తల్లి హత్య ఇస్లాం తీవ్రవాదులు, ముషారాఫ్‌ పాలనల కారణంగా జరిగిందని చెప్పారు. ఆమెను హత్య చేయమని అల్‌ ఖైదా ఆదేశాలు జారీ చేసిందని, దాడి మాత్రం తాలిబన్లు చేశారని, తన తల్లిపై దాడి జరుగుతుందని కావాలనే ముషార్రఫ్ భద్రత తగ్గించారని ఆయన ఆరోపించారు. ముషార్రఫ్ తన తల్లిని హత్య చేశాడని, తన తల్లికి అతడినే బాధ్యుడిని చేస్తానని స్పష్టం చేశారు. తన తల్లి ఇచ్చే సహాయ సహకారాలపైనే ఆమె భద్రత ఆధారపడి ఉంటుందని కూడా అతడు బెనజీర్‌ను బెదిరించాడని చెప్పారు.

ముషార్రఫ్ ఎమర్జెన్సీ విధించినప్పుడే పాకిస్థాన్‌ ప్రజాస్వామ్యానికి తిరిగి రావడం ఇష్టం లేదనే విషయం స్పష్టమైందని, తన తల్లి అతడికి వ్యతిరేకంగా మాట్లాడిన కొద్దీ భద్రత తగ్గుతూ వచ్చిందని ఆనయ అన్నారు. రావల్పిండిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొని తిరిగి వెడుతున్న భుట్టోను 2007, డిసెంబర్‌ 27వ తేదీన హత్య చేశారు. కాగా, స్వయంగా విధించుకున్న ప్రవాసంలో 2008 నుంచి లండన్‌లో, దుబాయ్‌లో ఉంటున్న ముషారాఫ్‌ స్వదేశానికి తిరిగి వచ్చే యోచనను నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. తిరిగి రాగానే అరెస్టు తప్పదని ప్రభుత్వం హెచ్చరించడంతో ఎన్నికలలో పోటీ చేయాలనే ఆలోచనను విరమించుకున్నారు.

కాగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అధిపతిగా ఉన్న బిలావల్‌ తాను గత ఎన్నికలలో ప్రచారం చేయలేదని, అప్పుడు తాను చురుకైన పాత్ర పోషించడం సరికాదన్న భావనతోనే యూనివర్సిటీకి తిరిగి వెళ్ళానని చెప్పారు. అయితే రానున్న ఎన్నికలలో ప్రచారం చేసి, పెద్ద పాత్ర పోషించాలని భావిస్తున్నానని చెప్పారు. ఏదో ఒకరోజున పాకిస్థాన్‌ నాయకుడు కావానుకుంటున్నారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ పాకిస్థాన్‌కిది గడ్డు సమయమని అందరూ సాయపడాలని వ్యాఖ్యానించారు.

English summary
The Pakistan President Pervez Musharraf was responsible for the murder of his mother and former Prime Minister Benazir Bhutto, her son and Pakistan Peoples Party chairman Bilawal Bhutto Zardari has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X