హౌస్ అరెస్టులపై విజయమ్మ లేఖ, భన్వర్‌లాల్ ఆదేశం

వైయస్ విజయమ్మ రాసిన లేఖను పార్టీ నాయకులు ఎంవి మైసురా రెడ్డి, కొండా సురేఖ, రోజా సోమవారం భన్వర్‌లాల్‌కు అందజేశారు. ప్రచారానికి వెళ్లకుండా తమ పార్టీ అభ్యర్థులను హౌస్ అరెస్టు చేస్తున్నారని విజయమ్మ భన్వర్‌లాల్ దృష్టికి తెచ్చారు. పార్టీ అభ్యర్థులపై వదిలేయాలని ఆమె కోరారు. ఒక పార్టీకి చెందిన అభ్యర్థులను ప్రచారం చేసుకోకుండా అడ్డుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా ఎనిమిది స్థానాలకు చెందిన తమ పార్టీ అభ్యర్థులను హౌస్ అరెస్టు చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి గ్రామాల్లో పార్టీ కార్యకర్త వరకు పోలీసులు అరెస్టు చేసి, ఎన్నికల ప్రచారం చేసుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గట్టు రామచందర్ రావు ఆరోపించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను పలువురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వారిలో అంబటి రాంబాబు, జూపూడి ప్రభాకర రావు వంటి నాయకులతో పాటు బాలినేని శ్రనివాస రెడ్డి వంటి పార్టీ అభ్యర్థులు కూడా ఉన్నారు. పలు చోట్ల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications