హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు విధేయత, ఆళ్ల నానికి షోకాజ్ నోటీసు

By Pratap
|
Google Oneindia TeluguNews

Alla Nani
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి విధేయత ప్రదర్శించిన పార్టీ ఏలూరు శానససభ్యుడు ఆళ్ల నానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) క్రమశిక్షణా సంఘం సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైయస్ జగన్ సిబిఐ విచారణకు వెళ్తున్న సమయంలో శుక్రవారంనాడు, శనివారం నాడు ఆళ్ల నాని ఆయన ఇంటికి వెళ్లడమే కాకుండా ఆయనతో పాటు సిబిఐ కార్యాలయం దిల్‌కుషా అతిథి గృహం దాకా వెళ్లారు.

జగన్ వెంట ఆళ్ల నాని వెళ్లడానికి పిసిసి క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కంతేటి సత్యనారాయణ రాజు క్రమశిక్షణా రాహిత్యంగా భావించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో చర్చించిన తర్వాత ఆయన ఆళ్లనానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. జూన్ 4వ తేదీ లోగా నోటీకుసు సమాధానం ఇవ్వాలని ఆయన ఆళ్ల నానిని ఆదేశించారు. అయితే, దీనిపై మాట్లడడానికి ఆళ్ల నాని అందుబాటులో లేరు. నోటీసులు అందిన తర్వాత తగిన వివరణ ఇస్తామని ఆళ్ల నాని అనుచరులు అంటున్నారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యుడు రంగారావు కూడా వైయస్ జగన్‌ను కలిసి తన మద్దతు ప్రకటించారు. జగన్‌కు తాను సంఘీభావం తెలిపినట్లు రంగారావు చెప్పారు. దీనిపై పిసిసి క్రమశిక్షణా సంఘం సమీక్షిస్తోంది. కాగా, పార్లమెంటు సభ్యుడు సబ్బం హరిపై పిసిసి ఎఐసిసికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సబ్బం హరి కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు.

ఇదిలావుంటే, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి కాంగ్రెసు శానససభ్యులు చాలా మంది వస్తారని సబ్బం హరి అన్నారు. ముగ్గురు పార్లమెంటు సభ్యులు జగన్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన గత రెండు రోజులుగా చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్తారని భావిస్తున్న శానససభ్యులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు.

English summary
PCC desciplinary committee chairman Kantheti Satyabarayana Raju issued show cause notice to Eluru MLA Alla Nani for supporting YSR Congress president YS Jagan. It is said that PCC has complained to AICC on MP Sabbam Hari.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X