హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రంలో పెట్రోల్ ధర తగ్గింపు: ముఖ్యమంత్రి చర్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు పెట్రోల్ ధర విషయంలో కొంత ఊరట లభించనుంది. పెట్రోల్‌పై పన్నును 3 శాతం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాణిజ్య శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మూడు శాతం పన్ను తగ్గిస్తే పెట్రోల్ ధర రూపాయిన్నర నుంచి రూపాయి ఎనబై పైసల వరకు తగ్గుతుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్‌పై 33 శాతం పన్ను విధిస్తున్నారు. దాన్ని 30 శాతానికి తగ్గిస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వాణిజ్య శాఖ అధికారులను ఆదేశించారు. అయితే, దీనికి ఎన్నికల కమిషన్ అనుమతి పొందాలని కూడా ఆయన వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి అవసరమైంది.

పెట్రోల్ ధర తగ్గింపు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పన్నును తగ్గించి, చర్యలు తీసుకోవాలని ఇటీవల పెట్రోలియం శాఖ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి సూచించారు. ఢిల్లీ ప్రభుత్వం పన్నును తగ్గించింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర కాస్తా తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ లీటరు ధర 80 రూపాయలకు పైగా ఉంది. దానివల్ల ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ అనుమతి లభించిన వెంటనే పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం పన్ను తగ్గింపును అమలులోకి తెస్తుంది. పెట్రోల్ ధర తగ్గింపునకు అనుమతి ఇచ్చేది లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ చెప్పారు.

పెట్రోల్ ధర పెంపునకు నిరసనగా రేపు (గురువారం) భారత్ బంద్ జరగనుంది. ఈ బంద్‌నకు రాష్టం నుంచి తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించాయి.

English summary
CM Kiran Kumar Reddy has decided to reduce tax 3% tax on petrol. With this litre petrol cost will be reduced. Commercial tax department will take permission to implement this decision as bypolls are there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X