వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై విజయమ్మ వైఖరి చెప్పాల్సిందే: కెటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

KT Rama Rao
హైదరాబాద్: వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ప్రచారానికి రావడానికి ముందు తెలంగాణపై వైఖరి చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు డిమాండ్ చేశారు. తెలంగాణకు తాము అనుకూలమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో కొండా సురేఖ దంపతులు చెప్పించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే రాజీనామా చేశానని కొండా సురేఖ అబద్ధం చెబుతున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

వైయస్ జగన్ కోసమే కొండా సురేఖ రాజీనామా చేశారని ఆయన అన్నారు. జగన్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాజీనామా చేసి తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు రాజీనామ చేశానని సురేఖ అంటే నమ్మేవారు ఎవరూ లేరని ఆయన అన్నారు. జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవాలని, వైయస్ రాజశేఖర రెడ్డి హయంలో విడుదల చేసిన జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సిబిఐ నిష్ఫక్షపాతంగా దర్యాప్తు చేస్తుందని నిరూపించుకోవాలంటే వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో సలహాదారుగా పనిచేసిన కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కూడా విచారించాలని డిమాండ్ చేశారు. వైయస్ జగన్‌ను ఎప్పుడో అరెస్టు చేయాల్సిందని ఆయన అన్నారు. వైయస్ జగన్ అవినీతిలో మంత్రులకు కూడా పాత్ర ఉందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో మంత్రులను విచారించి, వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అవినీతిలో కాంగ్రెసు పార్టీకి వాటా ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలను పరకాల ప్రజలు తిరస్కరిస్తారని ఆయన చెప్పారు. తాను తెలంగాణవాదిని కానని, సమైక్యవాదినని కొండా సురేఖ ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో చెప్పిన మాటల సిడిని కెటి రామారావు విడుదల చేశారు.

English summary
Telangana Rastra Samithi (TRS) MLA KT Ramam Rao demanded YSR Congress honourary president YS Vijayamma clarify stand on Telangana. He criticised that Konda Surekha, YSR Congress candidate of Parkal assembly is anti Telangana leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X