హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూకి తరహా గెలుపు జగన్‌కు: నల్లపురెడ్డి, జగన్‌తో మీట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nallapureddy Prasanna Kumar Reddy
హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు శాసన సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుధవారం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అరెస్టు వెనుక ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కుట్ర ఉందని ఆరోపించారు.

మయన్మార్‌లో ఆంగ్ సాన్ సూకీ పద్దెనిమిదేళ్లు జైలులో ఉన్నారని, ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమె 48 సీట్లకు గాను 44 గెలుచుకున్నారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ అదే పునరావృతం అవుతుందని అన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానంలో తమ పార్టీయే ఘన విజయం సాధిస్తుందని చెప్పారు. సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ గెలుస్తుందన్నారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి, జగన్ సతీమణి వైయస్ భారతి కూడా జగన్‌ను కలిశారు.

మరోవైపు ఇడుపులపాయలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను నాడు కాంగ్రెసు కోసం కుటుంబానికి దూరమయ్యానని, కుటుంబాన్ని కాదని కూడా పార్టీకి ప్రధాన్యమిస్తే అదే పార్టీ తమను విస్మరించిందని అన్నారు. వైయస్ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తే ఏ మాత్రం సహించేది లేదన్నారు.

వైయస్‌ను దేవుడు అన్న కాంగ్రెసు పెద్దలే నేడు అతనిని తిట్టడం చూసి పార్టీనీ వీడానన్నారు. గురువారం నుండి తాను ప్రచారంలో పాల్గొంటానని అన్నారు. వైయస్ జగన్‌ను దోషిగా కాంగ్రెసు చూపిస్తోందన్నారు. ఒక్కడిగా జగన్ చేస్తున్న న్యాయపోరాటంలో తానూ కలుస్తానన్నారు. వైయస్ బతికుంటే జైలుకు పోయేవారన్న కాంగ్రెసు పెద్దల వ్యాఖ్యలతో కలత చెందానని అన్నారు. కాంగ్రెసు కుట్రను తిప్పి కొట్టి జగన్‌కు అండగా ఉంటామన్నారు.

English summary
SPS Nellore district Kovvur MLA Nallapureddy Prasanna Kumar Reddy hoped Myanmar win would be repeat in Andhra Pradesh in YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy issue. He met YS Jagan in Chanchalguda jail on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X