హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వదిలేయండి: చానెల్ ప్రతినిధిని లాగిన తారా చౌదరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tara Choudhary
హైదరాబాద్: ఉద్యోగాలు, సినిమా అవకాశాల పేరిట అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపిందనే ఆరోపణలతో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వర్ధమాన నటి తారా చౌదరికి బెయిల్ లభించింది. గురువారం నాంపల్లి కోర్టు తారా చౌదరికి బెయిల్ మంజూరు చేసింది. పదివేల రూపాయలు గల రెండు పూచీకత్తులతో కోర్టు తారకు బెయిల్ మంజూరు చేసింది. తారా చౌదరి ఈ సంవత్సరం మార్చి 31వ తేదిన అరెస్టయింది. ఆమె రెండు నెలల పాటు జైలులో ఉన్నారు. నాలుగుసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న తారాకు చుక్కెదురయింది. ఈసారి మాత్రం ఊరట లభించింది. బెయిల్ లభించడంతో తారా చౌదరి జైలు నుంచి విడుదలైంది. ఇన్నాళ్లకు బెయిల్ లభించినందుకు సంతోషంగా ఉందని ఆమె అన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు చెబుతానని, ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదని ఆమె అన్నారు.

పనిలో పనిగా తారా చౌదరి ఓ టీవీ చానెల్ ప్రతినిధిని వివాదంలోకి లాగారు. ఓ టీవీ చానెల్ ప్రతినిధి తనకు అసభ్యమైన సందేశాలు పంపించాడని, వాటి ద్వారా తనను బ్లాక్ మెయిల్ చేశాడని, పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. కాగా, తనకు మాట్లాడే శక్తి లేదని, మైండ్ సరిగా లేదని, తనను వదిలేయాలని ఆమె అన్నారు. ఆమెను మీడియా ప్రతినిధులు చట్టుముట్టి మాట్లాడించే ప్రయత్నం చేశారు. కాగా, అమె రేపు (శుక్రవారం) బెంగళూర్‌కు మకాం మార్చే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపుతుందనే ఆరోపణలతో జూబ్లీహిల్స్ పోలీసులు రెండు నెలల క్రితం తారా చౌదరిని అరెస్టు చేశారు. ఇదే కేసులో ఆ తర్వాత తారా భర్త ప్రసాద్‌ను, వ్యక్తిగత కార్యదర్శి హనీఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని తమ కస్టడీకి తీసుకొని విచారించారు. అయితే తాను ఏ తప్పూ చేయలేదని తారా చౌదరి మీడియాతో పలుమార్లు చెప్పింది. పోలీసులే తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను బెయిల్ పైన బయటకు వస్తానని చెప్పింది.

బయటకు వచ్చిన అనంతరం కోర్టులో న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేసింది. ఆమెను చంచలగూడ మహిళా జైలులో ఉంచారు. పోలీసులు ఆమెను నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించారు. ప్రసాద్, హనీఫ్‌లను కూడా విచారించారు. విచారణకు తీసుకు వెళ్లే సమయంలో ఆమె తాను తప్పు చేయలేదని చెప్పింది. పోలీసులు తారా చౌదరి, ప్రసాద్, హనీప్‌ల నుండి పలు కీలకమైన విషయాలను రాబట్టారని తెలుస్తోంది.

ఆడియో రికార్డు వివరాలతో పాటు సెల్ ఫోన్ సంభాషణల వివరాలను ఆమె నుంచి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. తారా చౌదరి సెల్ డైరీని పరిశీలిస్తే దిమ్మ తిరిగే విషయాలు బయటపడినట్లుగా తెలిసింది. అరెస్టుకు ముందు మూడు నెలల కాలంలో తారా చౌదరి 8 వేల కాల్స్ చేసినట్లుగా చెప్పారు. అప్పుడు తారా చౌదరి సాగించిన సంభాషణల వివరాలను పోలీసులు పరిశీలించారని వార్తలు వచ్చాయి.

English summary
Nampally court issued bail to actor Tara Choudhary on Thursday. Tara Choudhary was arrested by Banjara Hills police on 31st of March. After arrest she was sent to Chanchalguda Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X